తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Exams 2024 : ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు - హాజరుకానున్న 9 లక్షల మంది విద్యార్థులు

TS Inter Exams 2024 : ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు - హాజరుకానున్న 9 లక్షల మంది విద్యార్థులు

31 January 2024, 17:36 IST

google News
    • Telangana Inter Exams 2024 Updates: ఈ ఏడాది నిర్వహించబోయే వార్షిక పరీక్షలకు ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది తెలంగాణ ఇంటర్ బోర్డు. ఇందుకు సంబంధించిన ముఖ్య వివరాలను పేర్కొంది. 9 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈసారి ఎగ్జామ్స్ రాయనున్నారు.
తెలంగాణ ఇంటర్ పరీక్షలు - 2024
తెలంగాణ ఇంటర్ పరీక్షలు - 2024 (https://tsbie.cgg.gov.in/)

తెలంగాణ ఇంటర్ పరీక్షలు - 2024

Telangana Inter Exams 2024 : తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పరీక్ష ఫీజు గడువు ముగియటంతో… ఈసారి పరీక్ష రాయబోయే విద్యార్థుల సంఖ్యతో పాటు ఎగ్జామ్ సెంటర్ల వివరాలను పేర్కొంది. ఈ ఏడాది 9 లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నట్లు తెలిపింది. ఇందులో 4,78,527 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. మొత్తం కలిపి 9,22,520 మంది విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించారు.

1వ తేదీ నుంచి ప్రాక్టికల్స్…

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి నెలలో వార్షిక పరీక్షలకు హాజరయ్యే ఇంటర్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 16వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్ ను రెండు సెషన్స్ లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు (మార్నింగ్ సెషన్), మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 వరకు (మధ్యాహ్న సెషన్)లో పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ను ఫిబ్రవరి 16న నిర్వహించనున్నారు. ఎథిక్స్ & హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు (2023-24 విద్యా సంవత్సరానికి ముందు అడ్మిషన్ పొందిన విద్యార్థులు, బ్యాక్‌లాగ్‌లు ఉన్న పాత విద్యార్థులకు) ఫిబ్రవరి 17న ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు నిర్వహించనున్నారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫిబ్రవరి 19న ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో మొత్తం 2032 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది ప్రాక్టికల్ పరీక్షలకు 3,21,803 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఎంపీసీ స్ట్రీమ్‌లో 2,17,714 మంది, బైపీసీలో 1,04,089 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఒకేషనల్ కోర్సుల్లో 94,819 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ కు హాజరుకానున్నారు. ఒకేషనల్ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 48,277, రెండో సంవత్సరంలో 46,542 విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాయనున్నారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్

28 -02- 2024 : సెకండ్ లాగ్వేజ్

01 -03- 2024 : ఇంగ్లీష్

4-03- 2024 : మ్యాథ్య్ 1, బోటనీ, పొలిటికల్ సైన్స్ -1

6-03- 2024 : మ్యాథ్స్ - 2, జువాలజీ, హిస్టరీ

11-03- 2024 : ఫిజిక్స్, ఏకానమిక్స్ -1,

13-03- 2024 : కెమిస్ట్రీ, కామర్స్

15-03- 2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్డి కోర్స్ మ్యాథ్స్ -1

18-03- 2024 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జియోగ్రఫీ -1.

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్

29 -02- 2024 : సెకండ్ లాగ్వేజ్

20 -03- 2024 : ఇంగ్లీష్ 2

5-03- 2024 : మ్యాథ్య్ 2A, Botny 2, పొలిటికల్ సైన్స్ -2

7-03- 2024 : మ్యాథ్స్ - 2B, జువాలజీ, హిస్టరీ

12-03- 2024 : ఫిజిక్స్, ఏకానమిక్స్ ,

14-03- 2024 : కెమిస్ట్రీ, కామర్స్ - 2

16-03- 2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్డి కోర్స్ మ్యాథ్స్ -1

19-03- 2024 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జియోగ్రఫీ -2.

తదుపరి వ్యాసం