TS Inter Practical Schedule : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల-hyderabad news in telugu ts intermediate practical schedule released ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Practical Schedule : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

TS Inter Practical Schedule : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Bandaru Satyaprasad HT Telugu
Jan 30, 2024 10:05 PM IST

TS Inter Practical Schedule : తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 1 నుంచి 16వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్స్ షెడ్యూల్
తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్స్ షెడ్యూల్

TS Inter Practical Schedule: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి నెలలో వార్షిక పరీక్షలకు హాజరయ్యే ఇంటర్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 16వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్ ను రెండు సెషన్స్ లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు (మార్నింగ్ సెషన్), మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 వరకు (మధ్యాహ్న సెషన్)లో పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ను ఫిబ్రవరి 16న నిర్వహించనున్నారు.

ఎథిక్స్ & హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు (2023-24 విద్యా సంవత్సరానికి ముందు అడ్మిషన్ పొందిన విద్యార్థులు, బ్యాక్‌లాగ్‌లు ఉన్న పాత విద్యార్థులకు) ఫిబ్రవరి 17న ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు నిర్వహించనున్నారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫిబ్రవరి 19న ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో మొత్తం 2032 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది ప్రాక్టికల్ పరీక్షలకు 3,21,803 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఎంపీసీ స్ట్రీమ్‌లో 2,17,714 మంది, బైపీసీలో 1,04,089 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఒకేషనల్ కోర్సుల్లో 94,819 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ కు హాజరుకానున్నారు. ఒకేషనల్ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 48,277, రెండో సంవత్సరంలో 46,542 విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాయనున్నారు.

విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు టెలి-మనస్

పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి ఉంటుంది. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు ఇంటర్ బోర్డు... విద్యార్థులకు టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ ఏర్పాటు చేసింది. సైకాలజిస్టులు, సైకియాట్రిస్టుల ద్వారా టెలి-మనస్ ఏర్పాటు చేసింది. పరీక్ష రాస్తున్న విద్యార్థులు భయం లేదా ఒత్తిడి చెందకుండా వారిని మోటివేట్ చేసేందుకు ఈ సదుపాయం కల్పించినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా విద్యార్థులు ఈ సేవలను పొందవచ్చు. సైకాలజిస్టులు, సైకియాట్రిస్టుల నుంచి సలహాలు, సూచనలు పొందవచ్చని తెలిపింది. టెలి-మనస్ ద్వారా విద్యార్థులు తమ సమస్యలు తెలియజేసి పరిష్కారాలు పొందవచ్చని అధికారులు తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్లు 14416 లేదా 1800-914416 టెలి-మనస్ సర్వీస్, టెలి-కౌన్సెలింగ్ పొందవచ్చు.

ఇంటర్ పరీక్షల షెడ్యూల్

తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 18వ తేదీతో ఎగ్జామ్స్ ముగియనున్నాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు ఉండనున్నాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు ఇంగ్లీష్‌ ప్రాక్టికల్‌ పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహించనున్నట్లు బోర్డు పేర్కొంది.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్

  • 28 -02- 2024 : సెకండ్ లాగ్వేజ్
  • 01 -03- 2024 : ఇంగ్లీష్
  • 4-03- 2024 : మ్యాథ్య్ 1, బోటనీ, పొలిటికల్ సైన్స్ -1
  • 6-03- 2024 : మ్యాథ్స్ - 2, జువాలజీ, హిస్టరీ
  • 11-03- 2024 : ఫిజిక్స్, ఏకానమిక్స్ -1,
  • 13-03- 2024 : కెమిస్ట్రీ, కామర్స్
  • 15-03- 2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్డి కోర్స్ మ్యాథ్స్ -1
  • 18-03- 2024 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జియోగ్రఫీ -1.

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్

  • 29 -02- 2024 : సెకండ్ లాగ్వేజ్
  • 20 -03- 2024 : ఇంగ్లీష్ 2
  • 5-03- 2024 : మ్యాథ్య్ 2A, Botny 2, పొలిటికల్ సైన్స్ -2
  • 7-03- 2024 : మ్యాథ్స్ - 2B, జువాలజీ, హిస్టరీ
  • 12-03- 2024 : ఫిజిక్స్, ఏకానమిక్స్ ,
  • 14-03- 2024 : కెమిస్ట్రీ, కామర్స్ - 2
  • 16-03- 2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్డి కోర్స్ మ్యాథ్స్ -1
  • 19-03- 2024 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జియోగ్రఫీ -2

Whats_app_banner

సంబంధిత కథనం