TS SSC Exams 2024 Updates : టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజు గడువు పొడిగింపు - ఇదే చివరి అవకాశం..!
06 February 2024, 19:11 IST
- Telangana SSC Exam Fees Schedule 2024 : పదో తరగతి పరీక్షల ఫీజుకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. పరీక్ష ఫీజు గడువును ఫిబ్రవరి 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది.
తెలంగాణ పదో తరగతి పరీక్షలు - 2024
TS SSC Public Exams 2024 Updates : పదో తరగతి విద్యార్థులకు అలర్ట్ ఇచ్చింది ప్రభుత్వ పరీక్షల విభాగం. వార్షిక పరీక్షల ఫీజుకు సంబంధించిన షెడ్యూల్ ను ఇప్పటికే విడుదల చేయగా... ఎగ్జామ్ ఫీజు గడువు కూడా ముగిసింది. అయితే పరీక్షల ఫీజు తత్కాల్ పథకం కింద ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఫీజును చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1,000 ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజును చెల్లించేందుకు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. గడువు పొడిగించే ప్రసక్తి లేదని వెల్లడించారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు విద్యార్ధులు చెల్లించిన ఫీజు మొత్తాన్ని ఫిబ్రవరి 6వ తేదీలోపు ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాలని ఆదేశించారు. అదేరోజు నామినల్ రోల్స్‌ను కూడా డీఈవో కార్యాలయానికి పంపాలని సూచించారు.
పదో తరగతి ఫీజు చెల్లింపు - ముఖ్య తేదీలు:
పరీక్ష ఫీజుకు తుది గడువు - 05 ఫిబ్రవరి.2024.
వెయ్యి రూపాయల ఆలస్య రుసుంతో ఈ గడువు ఉంది.
రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది.
ఇక మూడు సబ్జెక్టులు, అంత కంటే తక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 110 చెల్లించాలి.
మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 125 ను కట్టాలి.
వొకేషనల్ విద్యార్థులు రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్
మార్చి 18- ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, కాంపోజిట్ కోర్సు)
మార్చి 19- సెకండ్ లాంగ్వేజ్( హిందీ)
మార్చి 21- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
మార్చి 23- మ్యాథమెటిక్స్
మార్చి 26- సైన్స్ పేపర్ -1(ఫిజిక్స్)
మార్చి 28- సైన్స్ పేపర్ -2(బయాలజీ)
మార్చి 30- సోషల్ స్టడీస్
ఏప్రిల్ 1- ఒకేషనల్ కోర్సు (సంస్కృతం, అరబిక్ మొదటి పేపర్),
ఏప్రిల్ 2- ఒకేషనల్ కోర్సు(సంస్కృతం, అరబిక్ రెండో పేపర్).
TS Inter Practical Schedule: మరోవైపు తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి నెలలో వార్షిక పరీక్షలకు హాజరయ్యే ఇంటర్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 16వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్ ను రెండు సెషన్స్ లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు (మార్నింగ్ సెషన్), మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 వరకు (మధ్యాహ్న సెషన్)లో పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ను ఫిబ్రవరి 16న నిర్వహించనున్నారు.
ఎథిక్స్ & హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు (2023-24 విద్యా సంవత్సరానికి ముందు అడ్మిషన్ పొందిన విద్యార్థులు, బ్యాక్‌లాగ్‌లు ఉన్న పాత విద్యార్థులకు) ఫిబ్రవరి 17న ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు నిర్వహించనున్నారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫిబ్రవరి 19న ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించనున్నారు.రాష్ట్రంలో మొత్తం 2032 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది ప్రాక్టికల్ పరీక్షలకు 3,21,803 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఎంపీసీ స్ట్రీమ్‌లో 2,17,714 మంది, బైపీసీలో 1,04,089 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఒకేషనల్ కోర్సుల్లో 94,819 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ కు హాజరుకానున్నారు. ఒకేషనల్ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 48,277, రెండో సంవత్సరంలో 46,542 విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాయనున్నారు.