Ex Mla Muthireddy: మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పై మరో కేసు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కొడుకు
17 April 2024, 9:31 IST
- Ex Mla Muthireddy: జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ముత్తిరెడ్డి కూతురే ఆయనపై ఫోర్జరీ కేసు పెట్టగా.. తాజాగా మరో భూ వివాదంలో ఆయనపై మళ్లీ కేసు నమోదైంది.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై మరో భూకబ్జా కేసు నమోదు
Ex Mla Muthireddy: మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తమ భూమిని లాక్కున్నారని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కొడుకు పోలీసులకు ఫిర్యాదు Police Complaint చేశారు. అక్రమంగా తమ భూమిని తన పేరున బదలాయించుకున్నాడని సొంత పార్టీ బీఆర్ఎస్ BRS కు చెందిన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ Ex municipal Chair person గాడిపెల్లి ప్రేమలతారెడ్డి కొడుకు గాడిపెల్లి రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అధికారం లో ఉన్నా, లేకున్నా తరచూ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీరు వివాదాస్పదం అవుతుండటంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
జనగామ Janagama జిల్లా చీటకోడూరు గ్రామ శివారులోని 214 సర్వే నెంబర్ లోని ఐదు ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమిని Agriculture land ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చెందిన 39వ సర్వే నెంబర్ లోకి అక్రమంగా బదలాయించుకున్నాడని ఇటీవల ప్రేమలతారెడ్డి కొడుకు రాజేందర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు.
సొంత పార్టీకి చెందిన వారిమే అయినా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా కబ్జా చేయడమే కాకుండా, తనపై అక్రమ కేసులు పెట్టించి, అనేక ఇబ్బందులకు గురి చేశాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయమై ముత్తిరెడ్డిని పలుమార్లు ప్రశ్నించామని, దీంతో నిలదీసిన పాపానికి తన కుటుంబ సభ్యులను బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయారు.తనను విదేశాలకు వెళ్లకుండా అడ్డంకులు సృష్టిస్తున్నాడని, రాజేందర్ రెడ్డి లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు.
విచారణ జరిపి కేసు నమోదు
మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రేమలతారెడ్డి కొడుకు రాజేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జనగామ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు జనగామ ఏసీపీ అంకిత్ కుమార్ శంక్వాడ్, జనగామ రెవెన్యూ అధికారుల సమక్షంలో విచారణ జరిపించారు.
వివాదాస్పద భూమిని పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. అందులో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు ఆయన అనుచరుడు భూరెడ్డి ప్రమోద్ రెడ్డి ఈ భూ వివాదంలో తలదూర్చి, అక్రమంగా బదలాయించుకున్నారని నిర్ధారణ కావడంతో ఏసీపీ అంకిత్ కుమార్ శంక్వాడ్ సీరియస్ అయ్యారు.
అనంతరం ఆయన ఆదేశాల మేరకు జనగామ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్లు 447, 427, 506 r/w34 ప్రకారం కేసులు నమోదు చేశారు. అక్రమంగా భూమిని బదలాయించుకున్నారని తేలిన నేపథ్యంలో రేపో మాపో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
గతంలో కేసు పెట్టిన ముత్తిరెడ్డి కూతురు
జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వివాదాస్పద నేతగా పేరుంది. గతంలో కూడా భూ వివాదాల్లో తలదూర్చిన ఘటనలు ఉండగా.. తన సంతకం ఫోర్జరీ చేసి, తన భూమిని ముత్తిరెడ్డి లాక్కున్నాడని ఆయన కూతురు తుల్జాభవానిరెడ్డి కేసు పెట్టిన విషయం తెలిసిందే.
గతేడాది మే నెలలో ఈ ఘటన జరగగా.. తండ్రిపైనే తుల్జాభవానిరెడ్డి కేసు పెట్టడం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. సిద్దిపేట జిల్లా చేర్యాలలో తనకు చెందిన 20 ఎకరాల భూమిని తన తండ్రి ముత్తిరెడ్డి ఆక్రమించుకున్నారని, ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు.
ఆ భూమి విషయంలో తన సంతకాన్ని ముత్తిరెడ్డి ఫోర్జరీ చేశాడని, అనంతరం ఆ భూమి లాక్కుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు గతేడాది మే నెలలో తుల్జాభవానీరెడ్డి ముత్తిరెడ్డిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆయనపై ఉప్పల్ పోలీసులు సెక్షన్ 406, 420, 463, 464, 468, 471 ఆర్/డబ్ల్యూ 34ఐపీసీ, 156(3) సీఆర్పీసీ ప్రకారం కేసులు నమోదు చేశారు.
భూమి విషయంలో తండ్రీకూతుళ్లు ఇద్దరూ పోలీస్ స్టేషన్ గడప తొక్కడంతో అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా అప్పట్లో అధికారంలో ఉన్న ఆయన ఆరోపణలు కొట్టి పారేయగా.. ఇప్పుడు తాజాగా మరో కేసులో ముత్తిరెడ్డి ఇరుక్కోవడం తీవ్ర చర్చకు దారి తీసింది.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)