తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : రన్నింగ్ బస్సులో మహిళపై లైంగిక దాడి.. 4 రోజుల తర్వాత..

Hyderabad : రన్నింగ్ బస్సులో మహిళపై లైంగిక దాడి.. 4 రోజుల తర్వాత..

22 September 2024, 15:25 IST

google News
    • Hyderabad : యువతులు, మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అలా భయపడుతూనే.. ఊరెళ్దామనుకున్న ఓ మహిళపై లైంగిక దాడి జరిగింది. అది కూడా రన్నింగ్ బస్సులో. ఈనెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రన్నింగ్ బస్సులో మహిళపై లైంగిక దాడి
రన్నింగ్ బస్సులో మహిళపై లైంగిక దాడి (HT)

రన్నింగ్ బస్సులో మహిళపై లైంగిక దాడి

రన్నింగ్ బస్సులో ప్రయాణిస్తున్న వివాహితపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న వివాహిత మహిళపై.. బస్సు క్లీనర్ లైంగిక దాడికి పాల్ప డ్డాడు. ఈ సంఘటన ఈ నెల 18న జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సామర్లకోటకు చెందిన మహిళ (28) హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటుంది. అక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో స్వగ్రామానికి వెళ్లేందుకు ఈ నెల 18న కూకట్‌పల్లిలో ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఎక్కింది. అదేరోజు రాత్రి అక్కడి నుంచి బస్సు బయలుదేరింది.

క్లీనర్ సీటు వద్దకు వచ్చి..

కాసేపటి తర్వాత బస్సులో ఉన్న క్లీనర్.. ఆమె ఉన్న సీటు వద్దకు వచ్చాడు. బలవంతంగా ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగికదాడికి పాల్పడే సమయంలో ఆమె కేకలు వేసేందుకు ప్రయత్నించగా.. క్లీనర్ బెదిరించాడు. దీంతో ఏం చేయలేని నిస్సాహాయ స్థితిలో ఆ మహిళ ఉండిపోయింది. మహిళ మరుసటి రోజు సామర్లకోటలోని ఇంటికి చేరుకుంది.

భయం.. భయంగా..

భయం భయంగా ఉండటంతో.. కుటుబం సభ్యులకు అనుమానం వచ్చింది. ఏం జరిగిదని కుటుబం సభ్యులు అడగ్గా.. బస్సులో జరిగిన ఘటన గురించి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను తీసుకొని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.

గతంలో కూడా..

ఈ ఏడాది జులై 31న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఇద్దరు డ్రైవర్లు.. 26 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి హైదరాబాద్ మీదుగా ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రకాశం జిల్లాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చుట్టూ క్లాత్స్ పెట్టి.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వెంటనే తేరుకున్న యువతి డయల్ 100 కు ఫోన్ చేసింది. అంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.

తదుపరి వ్యాసం