Raitubharosa Status: ఆంధ్రప్రదేశ్‌ రైతు భ‌రోసా చెల్లింపుల‌ను ఇలా చెక్ చేసుకోండి...-check raitu bharosa funds release status with aadhar number ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Raitubharosa Status: ఆంధ్రప్రదేశ్‌ రైతు భ‌రోసా చెల్లింపుల‌ను ఇలా చెక్ చేసుకోండి...

Raitubharosa Status: ఆంధ్రప్రదేశ్‌ రైతు భ‌రోసా చెల్లింపుల‌ను ఇలా చెక్ చేసుకోండి...

HT Telugu Desk HT Telugu
Jun 05, 2024 02:05 PM IST

Raitubharosa Status: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులకు అందించే రైతు భరోసా నిధులు అందాయో లేదో ఇలా తనిఖీ చేసుకోండి.

రైతు భరోసా పడిందో లేదో ఇలా తనిఖీ చేసుకోండి
రైతు భరోసా పడిందో లేదో ఇలా తనిఖీ చేసుకోండి

Raitubharosa Status: రాష్ట్రంలో రైతుల‌కు ఏడాది మూడు సార్లు సాయం అందించే రైతు భ‌రోసా చెల్లింపులు ఇలా చెక్ చేసుకోవాలి. రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల రైతుల‌కు ఆర్థిక స‌హాయం అందించేందుకు వైఎస్ఆర్ రైతు భ‌రోసా-2024 చెల్లింపు స్టేట‌స్ చెక్ చేసుకోవ‌డానికి ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఈ ప‌థ‌కం కింద ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్ల‌యితే, ఇప్పుడు https://ysrrythubharosa.ap.gov.in/ లో యాక్సెస్ చేయ‌బ‌డిన అధికారిక వెబ్‌సైట్‌లో చెల్లింపు స్టేట‌స్‌ను చెక్ చేసుకునే అవ‌కాశం అందుబాటులో ఉంది. పంట‌లు న‌ష్ట‌పోయి ఆర్థిక ప‌రిస్థితి చాలా బ‌ల‌హీనంగా ఉన్న రైతుల‌కు ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్థిక స‌హాయం, జీవిత బీమా, రోజుకు తొమ్మిది గంటల క‌రెంటు, ఉచిత బోర్‌వెల్‌, సున్నా వ‌డ్డీకి రుణాలు వంటి అనేక సౌక‌ర్యాలు క‌ల్పిస్తుంది.

ఈ ప‌థ‌కం కింద రైతుల‌కు ఏడాదికి రూ.13,500 ఆర్థిక సాయం అంద‌జేస్తుంది. ఈ మొత్తాన్ని డీబీటీ ద్వారా నేరుగా రైతులు బ్యాంకు ఖాతాల‌కు జ‌మ చేస్తారు. ఈ ప‌థ‌కం కింద ఇచ్చే మొత్తాన్ని మూడు ద‌శ‌లుగా అంద‌జేశారు. ప్ర‌తి సంవ‌త్స‌రం రైతుల‌కు మొద‌టి విడ‌త‌గా రూ.7,500, రెండో విడ‌త‌లో రూ.4,000 చొప్పున, మూడో విడ‌త‌లో రూ.2,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేస్తారు. అర్హులైన ద‌ర‌ఖాస్తుదారులు ఈ ప్ర‌యోజ‌నం ఐదేళ్ల పాటు అందిస్తారు.

ఈ ప‌థ‌కం కింద రైతుల‌కు మొద‌టి విడ‌త మొత్తాన్ని అందించారు. రెండో విడ‌త మొత్తాన్ని కూడా త్వ‌ర‌లో బ‌దిలీ చేయ‌నున్నారు. మీరు రెండో ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తాన్ని అందుకోవాల‌నుకుంటే, మీరు రెండో ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తాన్ని పొందుతారో లేదో తెలుసుకోవాలి. రైతు భ‌రోసా రెండో విడ‌త చెల్లింపు స్టేట‌స్ చెక్ చేసుకోవ‌డానికి ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌డానికి ఏపి ప్ర‌భుత్వం రైతుల‌కు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.

రైతు భ‌రోసా-2024 స్టేట‌స్ చెక్ చేయ‌డం ఎలా?

వైఎస్ఆర్ రైతు భ‌రోసా, పీఎం కిసాన్ చెల్లింపు స్టేట‌స్‌ని కూడా చెక్ చేయాల‌నుకుంటున్నారా? రెండో విడ‌త చెల్లింపు, ద‌ర‌ఖాస్తు స్టేట‌స్ ఎలా చెక్ చేయాలో కూడా తెలుసుకోవాల‌నుకుంటున్నారా? ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అందుకు ఒక వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చింది. చెల్లింపు స్టేట‌స్, ద‌ర‌ఖాస్తు స్టేట‌స్ చెక్ చేయాల‌నుకునేవారు ఇప్పుడు త‌మ ఇళ్ల వ‌ద్ద కూర్చొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవ‌చ్చు.

ముందుగా వైఎస్ఆర్ రైతు భ‌రోసా అధికారిక వెబ్‌పేజీ https://ysrrythubharosa.ap.gov.in/ ని సంద‌ర్శంచాలి.

  • హోంపేజీ డ్యాష్‌బోర్డ్‌లో ఇచ్చిన నౌ యువ‌ర్ స్టేట‌స్ ఆప్ష‌న్‌ఫై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు నౌ యువ‌ర్ రైతు భ‌రోసా చెల్లింపు స్టేట‌స్‌ను ఎంపిక చేసుకోవాలి.
  • త‌దుప‌రి పేజీ, ఇచ్చిన ఫీల్డ్‌లో మీ ఆధార్ కార్డు నంబ‌ర్‌ను న‌మోదు చేయాలి.
  • చివ‌రిగా కుడివైపున ఉన్న స‌బ్మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.
  • వెంట‌నే రైతు భ‌రోసా చెల్లింపుల‌కు సంబంధించిన వివ‌రాలు వ‌స్తాయి.

మ‌న ఫిర్యాదు స్టేట‌స్‌ను ఎలా చెక్ చేయాలి?

  • రైతు భ‌రోసా ఫిర్యాదు స్టేట‌స్‌ను చెక్ చేయ‌డానికి ముందుగా పీఎం కిసాన్ రైతు భ‌రోసా ప‌థ‌కం అధికారిక హోంపేజీకి వెళ్లాలి.
  • హోం స్క్రీన్‌పై గ్రీవెన్స్ స్టేట‌స్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.
  • ఇచ్చిన బాక్స్‌లో ఆధార్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి.
  • ఫారం కింద చూపిన స‌బ్మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీ ఫిర్యాదు స్టేట‌స్ వెలువ‌డ‌తాయి.

(రిపోర్టింగ్ జ‌గ‌దీశ్వ‌రరావు జ‌ర‌జాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner