తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Visits Temple: గంభీర్‌తో గొడవ.. మరుసటి రోజే భార్య అనుష్కతో కలిసి గుడికి వెళ్లిన విరాట్ కోహ్లి

Virat Kohli visits Temple: గంభీర్‌తో గొడవ.. మరుసటి రోజే భార్య అనుష్కతో కలిసి గుడికి వెళ్లిన విరాట్ కోహ్లి

Hari Prasad S HT Telugu

03 May 2023, 15:07 IST

google News
    • Virat Kohli visits Temple: గంభీర్‌తో గొడవ జరిగిన మరుసటి రోజే భార్య అనుష్కతో కలిసి గుడికి వెళ్లాడు విరాట్ కోహ్లి. ఎప్పుడు కాస్త ఖాళీ దొరికినా.. ఈ జంట అయితే వెకేషన్ కు లేదంటే ఆధ్యాత్మిక యాత్రకు వెళ్తుంది.
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ

Virat Kohli visits Temple: విరాట్ కోహ్లి క్రికెట్ ఫీల్డ్ లో ఎంత దూకుడుగా ఉన్న బయట మాత్రం కాస్త ఆధ్యాత్మిక చింతన ఎక్కువే. టైమ్ దొరికినప్పుడల్లా గుళ్లూగోపురాలు తిరుగుతూ ఉంటాడు. క్రికెట్ నుంచి బ్రేక్ దొరికితే చాలు.. భార్య అనుష్కతో కలిసి వెకేషన్ కో లేదంటే ఏ ఆధ్యాత్మిక యాత్రకో వెళ్తుంటాడు. తాజాగా ఓ వైపు ఐపీఎల్లో ఆడుతూనే భార్య అనుష్కతో కలిసి ఓ గుడికి వెళ్లాడు.

విరుష్క ఆలయానికి వెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో కోహ్లి పూర్తి సాంప్రదాయబద్ధంగా ధోతీ ధరించి కనిపించాడు. అటు అనుష్క పింక్ శారీలో గుడికి వెళ్లింది. లక్నోలో జరిగిన మ్యాచ్ తర్వాత ఈ జంట అక్కడి స్థానిక గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఆ టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్ తో విరాట్ గొడవ పడిన విషయం తెలిసిందే.

మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు అంటే మంగళవారం (మే 2) వీళ్లు గుడికి వెళ్లారు. ఇక ఈ మ్యాచ్ లో గొడవ విషయానికి వస్తే అసలు కోహ్లి, గంభీర్ మధ్య ఏం జరిగిందో పక్కనే ఉన్న ప్లేయర్స్ వెల్లడించారు. నిజానికి ఈ గొడవ కోహ్లి, నవీనుల్ హక్ మధ్య మొదలైంది. మ్యాచ్ చివర్లో ఈ ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. తర్వాత కూడా ప్లేయర్స్ హ్యాండ్ షేక్ సమయంలోనూ వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది.

ఈ సమయంలో లక్నో ప్లేయర్ కైల్ మేయర్స్.. కోహ్లితో మాట్లాడుతుండగా గంభీర్ వచ్చి అతన్ని పక్కకు తీసుకెళ్లాడు. దీంతో విరాట్ ఏదో అన్నాడంతో గంభీర్ కూడా కోపంతో అతనిపైకి వెళ్లాడు. అసలు నిన్నేమీ అనలేదు.. మధ్యలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావని గంభీర్ ను విరాట్ అడిగాడు. అయితే తన ప్లేయర్ ను తిడితే తన ఫ్యామిలీని తిట్టినట్లే అంటూ గంభీర్ సమాధానమిచ్చాడు.

ఈ ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుండటంతో రెండు జట్ల ప్లేయర్స్ వాళ్లను విడదీశారు. ఈ ఘటనపై బీసీసీఐ సీరియస్ అయింది. ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించింది.

తదుపరి వ్యాసం