Virat Kohli Injured: అనుష్కతో కలిసి డ్యాన్స్ చేయలేక గాయపడిన విరాట్ కోహ్లి-virat kohli injured while dancing with anushka sharma ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Injured: అనుష్కతో కలిసి డ్యాన్స్ చేయలేక గాయపడిన విరాట్ కోహ్లి

Virat Kohli Injured: అనుష్కతో కలిసి డ్యాన్స్ చేయలేక గాయపడిన విరాట్ కోహ్లి

Hari Prasad S HT Telugu
Apr 24, 2023 03:09 PM IST

Virat Kohli Injured: అనుష్కతో కలిసి డ్యాన్స్ చేయలేక గాయపడ్డాడు విరాట్ కోహ్లి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఓవైపు అనుష్క చాలా ఈజీగా స్టెప్స్ వేయగా.. కోహ్లి మాత్రం కాలికి గాయం చేసుకున్నాడు.

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ (ANI)

Virat Kohli Injured: క్రికెట్ లో విరాట్ కోహ్లి ఎంత గొప్ప ప్లేయర్ అయినా.. డ్యాన్స్ లో మాత్రం తన భార్య అనుష్క శర్మతో పోటీ పడలేకపోయాడు. ఈ క్రికెట్, బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సోమవారం (ఏప్రిల్ 24) షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో విరుష్క జంట కలిసి డ్యాన్స్ చేయడం చూడొచ్చు. అయితే కాస్త కఠినమైన ఆ స్టెప్ వేయడానికి కోహ్లి ఇబ్బంది పడ్డాడు.

ఓవైపు అనుష్క చాలా ఈజీగా చేసేస్తుంటే.. విరాట్ మాత్రం మధ్యలోనే గాయపడి తప్పుకున్నాడు. అది చూసి అనుష్క తెగ నవ్వింది. ఈ వీడియోను అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. డ్యాన్స్ పే ఛాన్స్ అంటూ ఈ వీడియోను అనుష్క పోస్ట్ చేసింది. ఇద్దరూ కలిసి అలా స్టైల్ గా నడుచుకుంటూ వచ్చి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ విరాట్ కొన్ని సెకన్లలోనే ఇక తన వల్ల కాదంటూ తప్పుకున్నాడు.

ఈ జంట పెళ్లి చేసుకుని ఆరేళ్లవుతున్నా.. ఇప్పటికీ కపుల్ గోల్స్ విసురుతున్నారు. 2013లో తొలిసారి ఓ షాంపూ యాడ్ లో కలుసుకున్న ఈ ఇద్దరూ తర్వాత నాలుగేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నారు. తర్వాత 2017లో పెళ్లితో ఒక్కటయ్యారు. 2021 జనవరిలో వీరికి ఓ పాప పుట్టింది. ఆమెకు వామికా అనే పేరు పెట్టారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన అనుష్క.. త్వరలోనే చక్డా ఎక్స్‌ప్రెస్ పేరుతో మాజీ పేస్ బౌలర్ ఝులన్ గోస్వామి బయోపిక్ తో రానుంది.

ఇటు విరాట్ ప్రస్తుతం ఐపీఎల్ తో బిజీగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ఈ సీజన్ లో మరోసారి ఆర్సీబీ కెప్టెన్సీ అవకాశం అతనికి వచ్చింది. కోహ్లి కెప్టెన్సీలో రెండు మ్యాచ్ లలోనూ ఆర్సీబీ గెలిచింది. బ్యాటింగ్ లోనూ అతడు మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ సీజన్ లో ఇప్పటికే నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు.

WhatsApp channel

సంబంధిత కథనం