IPL 2023 Play offs Schedule: ఐపీఎల్ ఫైనల్, ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు వేదికలు ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?
IPL 2023 Play offs Schedule: ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించి ప్లేఆఫ్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌కు ఆతిథ్యమిచ్చే షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. మే 28న అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ జరనుంది. దీంతో పాటు రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు చెన్నై వేదిక కానుంది.
IPL 2023 Play offs Schedule: ఐపీఎల్ 2023 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీజన్‌లో చాలా మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగడంతో ప్రేక్షకుల నుంచి విపరీతంగా రెస్పాన్స్ వస్తోంది. గత రెండు సీజన్లలో కోవిడ్ కారణంగా తగిన స్పందన రాకపోవడంతో ఈ సారి మాత్రం అద్భుతంగా సాగుతోంది ఈ టోర్నీ. మరో వారం రోజుల్లో లీగ్‌లో తొలి దశ మ్యాచ్‌లు ముగియనున్నాయి. అయితే ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభంలో కేవలం లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌నే ప్రకటించిన బీసీసీఐ(BCCI) తాజాగా ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల తేదీలు, వేదిక వివరాలను వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం నాడు ప్రకటన విడుదల చేసింది.
ఈ సీజన్‌లో లీగ్ మ్యాచ్‌లు మే 21తో ముగియనున్నాయి. ఆ తర్వాత మే 23 నుంచి 28 మధ్య కాలంలో ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు చెన్నై, అహ్మదాబాద్ వేదికలుగా మారనున్నాయి. చెన్నై చెపాక్ స్టేడియం మే 3న జరగనున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌తో పాటు మే 24న జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. మే 26న జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌తో పాటు మే 28న జరగనున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ నిర్వహించడం వరుసగా ఇది రెండో సారి. గుజరాత్ టైటాన్స్ హోం గ్రౌండ్ అయిన అహ్మదాబాద్ స్టేడియంలో లక్షా 32 వేల మంది వీక్షించే సౌలభ్యముంది. గతేడాది జరిగిన పైనల్‌కు కూడా ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. ఆ ఫైనల్‌లో రాజస్థాన్‌ను ఓడించి గుజరాత్ కప్పును కైవసం చేసుకుంది.
మరోపక్క చెన్నై ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వడం 2019 తర్వాత ఇదే తొలిసారి. మొత్తంగా ఐదు సారి ప్లే ఆఫ్స్‌ను నిర్వహించనుంది. గతంలో 2011, 2012 ఫైనల్స్‌ను కూడా నిర్వహించింది చెన్నై.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ వేదికలు, తేదీలు..
మే 23- క్వాలిఫయర్ 1 మ్యాచ్, చెన్నై చెపాక్ స్డేడియం
మే 23- ఎలిమినేటర్ మ్యాచ్, చెన్నై చెపాక్ స్టేడియం
మే 26- క్వాలిఫయర్ 2 మ్యాచ్, అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం
మే 28- ఫైనల్ మ్యాచ్, అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం.