Harbhajan on Kohli: కోహ్లిని కెప్టెన్‌గా కొన‌సాగించాలి - హ‌ర్భ‌జ‌న్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌-harbhajan singh says rcb doing well under kohli s captaincy ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Harbhajan On Kohli: కోహ్లిని కెప్టెన్‌గా కొన‌సాగించాలి - హ‌ర్భ‌జ‌న్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Harbhajan on Kohli: కోహ్లిని కెప్టెన్‌గా కొన‌సాగించాలి - హ‌ర్భ‌జ‌న్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 24, 2023 12:52 PM IST

Harbhajan on Kohli: ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో కెప్టెన్‌గా కోహ్లి అద‌ర‌గొడుతోన్నాడు. వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని అందుకున్నాడు. అత‌డిపై టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి

Harbhajan on Kohli: ఐపీఎల్ లో ఆదివారం రాజ‌స్థాన్ పై బెంగ‌ళూరు ఏడు ప‌రుగులు తేడాతో థ్రిల్లింగ్ విక్ట‌రీని అందుకున్న సంగ‌తి తెలిసిందే. పంజాబ్‌తో మ్యాచ్ త‌ర్వాత మ‌రోసారి ఈ మ్యాచ్‌లోనూ డుప్లెసిస్‌ స్థానంలో కోహ్లి కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఈ సీజ‌న్‌లో కోహ్లి కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన రెండో మ్యాచ్ ఇది.

ఈ రెండు మ్యాచుల్లో బెంగ‌ళూరు విజ‌యం సాధించ‌డంతో అత‌డి అభిమానులు మురిసిపోతున్నారు. ఆర్‌సీబీకి ప‌ర్మినెంట్ కెప్టెన్‌గా కోహ్లిని నియ‌మించాలంటూ ట్వీట్లు, కామెంట్స్ చేస్తోన్నారు. కోహ్లి కెప్టెన్సీపై మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ 2023 సీజ‌న్ మొత్తానికి ఆర్‌సీబీ కెప్టెన్‌గా కోహ్లిని కొన‌సాగించ‌డ‌మే మంచిదంటూ పేర్కొన్నాడు.

కోహ్లి కెప్టెన్సీలో జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న బాగుంద‌ని, ఇదే జోరును త‌ర్వాతి మ్యాచ్‌ల‌లో కొన‌సాగించ‌డం ఖాయ‌మ‌ని హ‌ర్భ‌జ‌న్ అన్నాడు. గ‌తంతో పోలిస్తే కెప్టెన్‌గా కోహ్లిలో మెచ్యురిటీ క‌నిపిస్తోంద‌ని తెలిపాడు. హ‌ర్భ‌జ‌న్ చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. కోహ్లి ఫ్యాన్స్ కూడా హ‌ర్భ‌జ‌న్ కామెంట్స్‌తో ఏకీభ‌విస్తోన్నారు.

2011లో ఆర్‌సీబీ కెప్టెన్సీ బాధ్య‌త‌లు తొలిసారి చేప‌ట్టాడు కోహ్లి. 2021 వ‌ర‌కు కెప్టెన్‌గా కొన‌సాగాడు. అత‌డి కెప్టెన్సీలో ఆర్‌సీబీ ఒక్క‌సారి కూడా క‌ప్ కొట్ట‌క‌పోవ‌డం, ఒత్తిడి కార‌ణంగా వ్య‌క్తిగ‌తంగా వ‌రుస వైఫ‌ల్యాల నేప‌థ్యంలో 2021లో కెప్టెన్సీ ప‌ద‌వికి గుడ్‌బై చెప్పాడు.

WhatsApp channel

టాపిక్