Kohli as RCB Captain: కోహ్లీ కెప్టెన్‌గా వచ్చాడు.. విజయాన్ని తీసుకొచ్చాడు-virat kohli leading rcb against rr and he says might have couple of games ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Virat Kohli Leading Rcb Against Rr And He Says Might Have Couple Of Games

Kohli as RCB Captain: కోహ్లీ కెప్టెన్‌గా వచ్చాడు.. విజయాన్ని తీసుకొచ్చాడు

Maragani Govardhan HT Telugu
Apr 23, 2023 09:03 PM IST

Kohli as RCB Captain: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ బాధ్యతలు తీసుకున్నాడు. రెండు మ్యాచ్‌లకు అతడు కెప్టెన్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కోహ్లీనే స్వయంగా తెలిపాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (PTI)

Kohli as RCB Captain: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 20 పరుగులు అవసరం కాగా.. ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ ఓ వికెట్ తీయడమే కాకుండా 12 పరుగులే ఇవ్వడంతో బెంగళూరు గెలుపు సాధ్యమైంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు. చాలా రోజుల తర్వాత పగ్గాలు తీసుకున్న కోహ్లీ తన కెప్టెన్సీ సామర్థ్యంతో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విషయంపై అతడు స్పందించాడు. మేనేజ్మెంట్ తనను రెండు మ్యాచ్‌లు కెప్టెన్సీ చేయమని చెప్పిందని తెలిపాడు.

కెప్టెన్‌గా రెండు మ్యాచ్‌లు ఉంటానేమో. "మేనేజ్మెంట్ రెండు మ్యాచ్‌లకు సారథ్యం వహించమని బాధ్యతలు అప్పగించింది. ఇందులో నేను చేసిందేమి లేదు. తిరిగి కెప్టెన్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఫాఫ్ డుప్లెసిస్ జట్టు కోసం ఎంత బాధ్యతాయుతంగా ఉంటున్నాడో అలాగే కొనసాగిస్తాను." అని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.

బెంగళూరు రెగ్యూలర్ కెప్టెన్ డూప్లెసిస్‌కు దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పక్కటెముకలకు గాయమైంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఈ గాయమైంది. దీంతో కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక ఆట విషయానికొస్తే విరాట్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో 279 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు.

రాజస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 7 పరుగుల తేడాతో గెలిచింది. 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచింది. రాజస్థాన్ బ్యాటర్లు దేవ్‌దత్ పడిక్కల్(52) అర్ధశతకంతో ఆకట్టుకున్నప్పటికీ జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీయగా.. సిరాజ్, డేవిడ్ విల్లీ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

అంతకముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌పై బెంగళూరు 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. డూప్లెసిస్(62), మ్యాక్స్‌వెల్(77) చెరో అర్ధశతకంతో విజృంభించారు.రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, సందీప్ శర్మ చెరో 2 వికెట్లు తీయగా.. అశ్విన్, చాహల్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం