తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Harbhajan On Kohli: కోహ్లిని టీమ్‌లో నుంచి తీసేయాలనుకుంటే అతనికి ముందే చెప్పండి: హర్భజన్ షాకింగ్ కామెంట్స్

Harbhajan on Kohli: కోహ్లిని టీమ్‌లో నుంచి తీసేయాలనుకుంటే అతనికి ముందే చెప్పండి: హర్భజన్ షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

03 May 2023, 14:14 IST

google News
    • Harbhajan on Kohli: కోహ్లిని టీమ్‌లో నుంచి తీసేయాలనుకుంటే అతనికి ముందే చెప్పండి అంటూ హర్భజన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా టీ20 టీమ్ లో ఇక రోహిత్, కోహ్లిలకు అవకాశం లేదన్న వార్తల నేపథ్యంలో అతడీ కామెంట్స్ చేయడం విశేషం.
విరాట్ కోహ్లి, హర్భజన్ సింగ్
విరాట్ కోహ్లి, హర్భజన్ సింగ్ (Getty Images)

విరాట్ కోహ్లి, హర్భజన్ సింగ్

Harbhajan on Kohli: ఇండియన్ క్రికెట్ టీమ్ మేనేజ్‌మెంట్ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? టీ20 టీమ్ లో సీనియర్లకు అవకాశం ఇస్తుందా లేదా? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మళ్లీ టీమిండియా తరఫున టీ20 క్రికెట్ ఆడతారా లేదా అన్నదానిపై ఇప్పటి వరకైతే ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ ఇద్దరూ మరో టీ20 మ్యాచ్ ఆడలేదు.

హార్దిక్ పాండ్యానే కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్ ప్లాన్ లో భాగంగా ఇక టీ20 జట్టులో రోహిత్, విరాట్ లకు స్థానం దక్కదని మేనేజ్‌మెంట్ వాళ్లకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే.. కోహ్లికి ముందే చెప్పాలని, పేపర్లలో వార్తలు చదివి తెలుసుకునే పరిస్థితి ఉండకూడదని అతడు అనడం గమనార్హం.

చెప్పకుండా తీసేయడం అలవాటు

ఇండియన్ టీమ్ లో ఎంతటి సీనియర్లు అయినా వాళ్లకు చెప్పకుండా పక్కన పెట్టడం అన్నది ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఇలాగే సెహ్వాగ్, ద్రవిడ్, కపిల్ దేవ్ లాంటి ప్లేయర్స్ ను పక్కన పెట్టారు. అయితే కోహ్లి విషయంలో అలా జరగకూడదని భజ్జీ స్పష్టం చేస్తున్నాడు.

"సెలక్టర్ల మైండ్ లో ఏముంది? వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారు అన్నది నాకు తెలియదు. కానీ వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలు గెలవలేకపోతే ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. సీనియర్ ప్లేయర్స్ దానికి బలవుతుంటారు. అయితే విరాట్ విషయంలో మాత్రం ఫామ్ కారణంగా అతన్ని పక్కన పెట్టడం అనేది జరగకూడదు" అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ హర్భజన్ అన్నాడు.

"అతనితో మాట్లాడండి. యువ జట్టును తయారు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పండి. ఏది చేసినా అతనితో మాట్లాడి చేయండి. నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్లకు చెప్పడం సరి కాదు. మమ్మల్ని పక్కన పెట్టిన తర్వాత న్యూస్ పేపర్లు చూస్తే కానీ తెలియలేదు. కోహ్లి విషయంలో అలా జరగకూడదు.

ఓ ప్లేయర్ కు గౌరవం ఇవ్వాలి. అది రోహిత్ అయినా, విరాట్ అయినా.. ఇంకెవరైనా. అలా చేసినప్పుడే ప్లేయర్స్, సెలక్టర్స్ మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఉంటాయి. ఓ ప్లేయర్ ను పక్కన పెట్టే సమయంలో అతనికి చెప్పకపోతే ఆ ప్లేయర్ చాలా బాధపడతాడు" అని హర్భజన్ అన్నాడు.

తదుపరి వ్యాసం