ICC Test rankings: టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్-icc test rankings as team india dethrones australia as number 1 team ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Icc Test Rankings: టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్

ICC Test rankings: టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్

Hari Prasad S HT Telugu
May 02, 2023 03:07 PM IST

ICC Test rankings: టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ అయింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్ ఇస్తూ.. ఇండియన్ టీమ్ టాప్ లోకి దూసుకెళ్లడం విశేషం.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టీమిండియా (ఫైల్ ఫొటో)
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టీమిండియా (ఫైల్ ఫొటో) (REUTERS)

ICC Test rankings: ఇండియన్ క్రికెట్ టీమ్ మరోసారి టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. ఐసీసీ మంగళవారం (మే 2) రిలీజ్ చేసిన లేటెస్టు ర్యాంకుల్లో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి టాప్ లోకి దూసుకెళ్లింది. ఇప్పుడదే టీమ్ తో జూన్ 7 నుంచి ఇంగ్లండ్ లోని ఓవల్లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో టీమిండియా తలపడనున్న విషయం తెలిసిందే.

ఐసీసీ తాజాగా యానువల్ ర్యాంకింగ్స్ అప్‌డేట్ చేయడంతో పాత మ్యాచ్ ల ఫలితాలతో ఇండియా నంబర్ వన్ అయింది. మార్చిలో ఇండియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-2తో ఓడినా కూడా ఇన్నాళ్లూ ఆస్ట్రేలియానే 122 పాయింట్లతో నంబర్ వన్ గా కొనసాగింది. అయితే తాజా అప్‌డేట్ లో ఆ టీమ్ రెండోస్థానానికి పడిపోయింది.

15 నెలలుగా టెస్టుల్లో నంబర్ వన్ గా కొనసాగిన ఆస్ట్రేలియాకు టీమిండియా చెక్ పెట్టింది. "యానువల్ ర్యాంకింగ్స్ లో భాగంగా మే 2020 నుంచి జరిగిన సిరీస్ లను పరిగణనలోకి తీసుకుంటాం. మే 2022కు ముందు జరిగిన సిరీస్ లకు 50 శాతం వెయిటేజీ, ఆ తర్వాత జరిగిన సిరీస్ లకు 100 శాతం వెయిటేజీ ఉంటుంది" అని ఐసీసీ మంగళవారం రిలీజ్ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.

గత యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ ను 4-0తో చిత్తు చేసిన తర్వాత ఇండియాను వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా టాప్ లోకి వెళ్లింది. అదే సమయంలో సౌతాఫ్రికా గడ్డపై సిరీస్ కోల్పోయిన ఇండియన్ టీమ్ టాప్ ర్యాంక్ కోల్పోయింది. మొత్తానికి 15 నెలల తర్వాత ఇండియా మరోసారి తన స్థానాన్ని కంగారూల నుంచి లాక్కుంది. టాప్ 2లో తప్ప మిగతా ర్యాంకుల్లో ఎలాంటి మార్పుల్లేవు.

Whats_app_banner

సంబంధిత కథనం