తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Points Table 2023 : పాయింట్ల పట్టికలో టాప్ 4లో ముంబయి.. 2 స్థానాలు పడిపోయిన ఆర్సీబీ

IPL Points Table 2023 : పాయింట్ల పట్టికలో టాప్ 4లో ముంబయి.. 2 స్థానాలు పడిపోయిన ఆర్సీబీ

Anand Sai HT Telugu

10 May 2023, 7:43 IST

google News
    • IPL 2023 Points Table : మంగళవారం (మే 9) వరకు మొత్తం 54 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్‌ల తర్వాత అప్‌డేట్ చేసిన పాయింట్ల పట్టిక ఇక్కడ ఉంది.
ముంబయి వర్సెస్ బెంగళూరు
ముంబయి వర్సెస్ బెంగళూరు (Mumbai Indians Twitter)

ముంబయి వర్సెస్ బెంగళూరు

IPL సీజన్ 16(IPL Season 16) జోరుగా సాగుతోంది. ఇప్పటికే చాలా జట్ల 11 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో RCB జట్టు పాయింట్ల పట్టికలో 2 స్థానాలు దిగజారింది. ముంబై ఇండియన్స్ అద్భుత విజయంతో టాప్-4లోకి ప్రవేశించింది. దీంతో ప్లేఆఫ్ రేసు మరింత ఉత్కంఠ రేపుతోంది. 54 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఐపీఎల్ పాయింట్ల పట్టిక వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్ టైటాన్స్ (16 పాయింట్లు): డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో 3 ఓటములు, 8 విజయాలు నమోదు చేసింది. దీంతో +0.951 నెట్ రన్ రేట్ అగ్రస్థానంలో నిలిచింది.

చెన్నై సూపర్ కింగ్స్ (13 పాయింట్లు): మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని CSK జట్టు 11 మ్యాచ్‌ల్లో 4 ఓటములు, 6 విజయాలు సాధించింది. మరో మ్యాచ్ రద్దు కారణంగా 1 పాయింట్ లభించింది. ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్న CSK జట్టు నెట్ రన్ రేట్ +0.409గా ఉంది.

ముంబై ఇండియన్స్ (12 పాయింట్లు): ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 ఓటములతో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ నెట్ రన్ రేట్ -0.255తో 3వ స్థానంలో ఉంది.

లక్నో సూపర్ జెయింట్స్ (11 పాయింట్లు) : 11 మ్యాచ్‌ల్లో 5 ఓటములు, 5 విజయాలు నమోదు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఒక మ్యాచ్ రద్దయింది. దీని ప్రకారం, 1 పాయింట్ పొందిన లక్నో జట్టు +0.294 నెట్ రన్ రేట్‌తో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది.

రాజస్థాన్ రాయల్స్ (10 పాయింట్లు): 11 మ్యాచ్‌లతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 5 విజయాలు, 6 ఓటములతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. RR జట్టు ప్రస్తుత నికర రన్ రేట్ నికర +0.388.

కోల్‌కతా నైట్ రైడర్స్ (10 పాయింట్లు): KKR ఆడిన 11 మ్యాచ్‌లలో 6 గెలిచింది. 5 ఓడిపోయింది. ప్రస్తుతం నితీష్ రాణా జట్టు నెట్ రన్ రేట్ -0.079తో 6వ స్థానంలో ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు): ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని RCB 11 మ్యాచ్‌లు ముగించింది. 5 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌లు ఓడిపోయింది. ప్రస్తుతం నెట్ రన్ రేట్ -0.345తో 7వ స్థానంలో ఉంది.

పంజాబ్ కింగ్స్ (10 పాయింట్లు): శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఆడిన 11 మ్యాచ్‌లలో 5 గెలిచింది. 6 ఓడింది. ప్రస్తుతం నెట్ రన్ రేట్ -0.441తో 6వ స్థానంలో ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (8 పాయింట్లు): 10 మ్యాచ్‌లలో 4 గెలిచి, 6 మ్యాచ్‌లు ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో -0.472 నెట్ రన్ రేట్‌తో 9వ స్థానంలో ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ (8 పాయింట్లు): డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 10 మ్యాచ్‌లలో 4 గెలిచింది. దీంతో ఢిల్లీ జట్టు నెట్ రన్ రేట్ -0.529తో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.

తదుపరి వ్యాసం