Rashmika Favourite IPL Team: నేషనల్ క్రష్ రష్మిక ఫేవరెట్ ఐపీఎల్ టీమ్, క్రికెటర్ ఎవరో తెలుసా?
01 May 2023, 18:42 IST
- Rashmika Favourite IPL Team: నేషనల్ క్రష్ రష్మిక ఫేవరెట్ ఐపీఎల్ టీమ్, క్రికెటర్ ఎవరో తెలుసా? ఈ పుష్ప స్టార్ తాజాగా స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ.. ఈ విశేషాలు పంచుకుంది.
ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో రష్మిక డ్యాన్స్
Rashmika Favourite IPL Team: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎంతో మంది ఫేవరెట్. ఆమె అందం, క్యూట్‌నెస్, స్మైల్ కు ఫిదా కాని వాళ్లు ఉండరు. మరి అదే రష్మిక ఫేవరెట్ ఐపీఎల్ టీమ్, ఫేవరెట్ క్రికెటర్ ఎవరో మీకు తెలుసా? తాజాగా స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన ఆమె.. ఈ విశేషాలను పంచుకుంది. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.
ఐపీఎల్ 2023 ఓపెనింగ్ సెర్మనీలో పర్ఫామ్ చేసిన ఆమె.. తాజాగా ఈ మెగా లీగ్ పై స్పందించింది. తన ఫేవరెట్ టీమ్ ఆర్సీబీ అని, ఇక క్రికెటర్ విరాట్ సర్ అని చెప్పడం విశేషం. "నా ఫేవరెట్ టీమ్ ఆర్సీబీయే. నాది బెంగళూరు, కర్ణాటక. "ఈ సాలా కప్ నమ్దే (ఈసారి కప్పు మనదే)". అదే నా ఫేవరెట్ టీమ్ అయింది. ఈసారి ఆర్సీబీ ఆడే మ్యాచ్ లను నేరుగా చూడాలని అనకుంటున్నా" అని రష్మిక చెప్పింది.
ఇక ఫేవరెట్ క్రికెటర్ గురించి అడిగినప్పుడు మరో ఆలోచన లేకుండా విరాట్ పేరు చెప్పింది. "విరాట్ సర్. అతడో స్వాగర్, అతడు అద్భుతం" అని రష్మిక అనడం విశేషం. నిజానికి ఓపెనింగ్ సెర్మనీలో పర్ఫామ్ చేసిన సందర్భంలోనూ తన ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లి అని ఆమె చెప్పింది. ఈసారి ఆర్సీబీ ప్రధానంగా కోహ్లి, డుప్లెస్సి, మ్యాక్స్‌వెల్ పైనే ఆధారపడటంతో నిలకడగా విజయాలు సాధించలేకపోతోంది.
మరోవైపు రష్మిక ప్రస్తుతం పుష్ప: ది రూల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో రష్మిక పుష్ప మూవీలో నుంచే సామి సామి.. శ్రీవల్లిలాంటి పాటలకు డ్యాన్స్ చేసింది. ఇక ఆస్కార్ విన్నర్ నాటు నాటు పాటకూ స్టెప్పులేసింది. ఈ సెర్మనీలో రష్మికతోపాటు తమన్నా, అరిజిత్ సింగ్ కూడా పర్ఫార్మ్ చేసిన విషయం తెలిసిందే.