Rashmika Mandanna : ఛాలెంజింగ్ పాత్రలో రష్మిక.. మహారాణిగా నేషనల్ క్రష్!-vicky kaushal and rashmika mandanna come together for new movie that base on chhatrapati sambhaji maharaj ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Mandanna : ఛాలెంజింగ్ పాత్రలో రష్మిక.. మహారాణిగా నేషనల్ క్రష్!

Rashmika Mandanna : ఛాలెంజింగ్ పాత్రలో రష్మిక.. మహారాణిగా నేషనల్ క్రష్!

Anand Sai HT Telugu
Apr 30, 2023 05:51 AM IST

Rashmika Mandanna New Movie : వరుస సినిమాలతో నటి రష్మిక మందన్న బిజీబిజీగా ఉంటోంది. మరో కొత్త చిత్రంతో ముందుకు రానుంది. విక్కీ కౌశల్ తో కలిసి నటించనుంది.

రష్మిక మందన్న
రష్మిక మందన్న (Rashmika Instagram)

విక్కీ కౌశల్, రష్మిక మందన్న(Rashmika Mandanna) ఒక లోదుస్తుల ప్రకటనలో కలిసి కనిపించారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. ఇప్పటికే పక్కింటి అమ్మాయిగా అందరి దృష్టిని ఆకర్షించింది నటి రష్మిక మందన్న. ఆమె చేసిన చాలా పాత్రలు గ్లామర్‌గా ఉంటాయి. ఇప్పుడు రష్మిక కొత్త ఛాలెంజ్‌ని స్వీకరించాలని నిర్ణయించుకుంది. చారిత్రాత్మక ఘట్టం ఆధారంగా రూపొందుతున్న పాత్రకు అంగీకరించనున్నట్టు సమాచారం.

ఈ పాత్ర కోసం రష్మిక చాలా ప్రిపేర్ అవుతోందట. ఇది విన్న రష్మిక అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్.. విక్కీ కౌశల్‌(vicky kaushal)తో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తుందని అంటున్నారు. చారిత్రక కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘చావా’(Chava) అనే పేరు పెట్టారు.

ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్(Chhatrapati Sambhaji Maharaj) కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం శంభాజీ ధైర్యసాహసాలు, యుద్ధాల్లో విజయం సాధించే వ్యూహం, త్యాగం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఇందులో భార్యాభర్తల మధ్య ఎమోషనల్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. మరాఠా సామ్రాజ్యానికి దూరంగా ఉన్నప్పుడు శంభాజీ భార్య అన్నీ నిర్వహించడం విశేషం. ఈ అంశం కూడా సినిమాలో హైలైట్ అవుతుంది.

ఈ సినిమా కోసం రష్మిక మందన్న సిద్ధమవుతుందని టాక్. విక్కీ కౌశల్(Vicky Kaushal) గుర్రపు స్వారీ, మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ పొందనున్నాడు. ఈ కారణాలతో సినిమా గురించి ఆసక్తికరంగా ఉంది. ఇది భారీ బడ్జెట్ చిత్రం, మడాక్ ఫిల్మ్స్ దీనికి సినిమాను నిర్మిస్తోంది. ఈ ప్రొడక్షన్ హౌస్ కింద 'స్త్రీ', 'భేడియా' వంటి సినిమాలు రూపొందాయి.

విక్కీ కౌశల్ ఈ మధ్య కాలంలో పెద్దగా విజయం సాధించలేదు. రష్మిక మందన్న వరుసగా విజయాలు సాధిస్తోంది. ఈ సినిమా(Cinema) ఎలా రూపొందుతుందనే ఆసక్తి నెలకొంది. మహారాణి పాత్రలో రష్మికను చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కన్నడ చిత్రాలతో చిత్రసీమలో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ రష్మిక తెలుగు, తమిళంతో పాటు ప్రస్తుతం హిందీలో పాపులర్ హీరోయిన్‍‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది. తన అందానికి, అభినయానికి సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. ఇటీవలే.. రష్మిక అరుదైన ఘనతను సాధించింది. ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ(IMDb) ప్రకటించిన పాపులర్ ఇండియన్ సెలబ్రెటీ జాబితాలో చోటు దక్కించుకుంది.

Whats_app_banner