IPL Team-Movie Name : ఐపీఎల్ టీమ్-సినిమా పేరు.. ఏ జట్టుకు ఏ తెలుగు సినిమా పేరు సెట్ అవుతుంది?-telugu movie titles to ipl 2023 teams based on performances ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Telugu Movie Titles To Ipl 2023 Teams Based On Performances

IPL Team-Movie Name : ఐపీఎల్ టీమ్-సినిమా పేరు.. ఏ జట్టుకు ఏ తెలుగు సినిమా పేరు సెట్ అవుతుంది?

ఐపీఎల్ టీమ్-సినిమా పేరు
ఐపీఎల్ టీమ్-సినిమా పేరు

IPL Team-Movie Name : 2023 టాలీవుడ్ కు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. మంచి మంచి సినిమాలు వచ్చాయి. మరోవైపు ఐపీఎల్ కూడా జరుగుతుంది. అయితే ఏ జట్టుకు ఏ సినిమా పేరు సరిపోతుందో.. సరదాగా చూద్దాం..

ఈ ఏడాది మెుదటి నుంచి తెలుగులో మంచి మంచి సినిమాలు వచ్చేశాయి. బ్లాక్ బస్టర్ సినిమాలు పడ్డాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు.. అనే తేడా లేకుండా.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. మరోవైపు ఐపీఎల్(IPL) కూడా ఊపుమీద సాగుతుంది. చివరి బంతి వరకూ ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠ ఉంటుంది. ఇక మ్యాచ్ అయిపోయినట్టే అనుకుంటుంటే.. బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. చివరి ఓవర్లలోనూ గెలుపును తిప్పేస్తున్నారు. సినిమాలో సస్పెన్స్ లాగా సాగుతున్నాయి ఐపీఎల్ మ్యాచులు. ఐపీఎల్ జట్లకు 2023లో(IPL Teams 2023) విడుదలైన కొన్ని సినిమా పేర్లు ఇచ్చాం. సరదాగా ఓసారి చదివేయండి.

ట్రెండింగ్ వార్తలు

గుజరాత్ టైటాన్స్ టీమ్ కు బలగం సినిమా టైటిల్ చక్కగా సరిపోతుంది. వాళ్లని తోపులు అనుకోవచ్చు. టీమ్ వర్క్ తో ముందుకు వెళ్తున్నారు. అందుకే బలగం.

చెన్నై సూపర్ కింగ్స్ - వాల్తేరు వీరయ్య. ఈ జట్టుకు ఈ సినిమా పేరు సరిగా సెట్ అవుతుంది. ఎందుకంటే.. దోనినే మనకు వాల్తేరు వీరయ్య. చెన్నై జట్టు అంటే ఎవరూ కనిపించరు. ఓన్లీ ధోనినే అంతే.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మీటర్ సినిమా టైటిల్ ఇవ్వొచ్చేమో. పంత్ లేని దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్ మీటర్ పగిలిపోయినట్టుగా ఉంది. టీమ్ కాస్త వెనకే ఉంటుంది.

దాస్ కా ధమ్కీ టైటిల్.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సరిపోతుంది. కొడితే బాల్ పగిలిపోవాల్సిందేననేలా కొంతమంది ఆడుతారు. దాస్ కా ధమ్కీలాగే.. ఈ జట్టుకు ఫైర్ ఎక్కువే.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు రైటర్ పద్మభూషణ్ టైటిల్ ఇవ్వచ్చేమో. కేఎల్ రాహుల్ రైటర్ పద్మభూషణ్ లా ఇబ్బందులు పడుతున్నాడు. పాపం అతడు ఆడకపోయినా.. టీమ్ మాత్రం సరిగా ఆడుతుంది.

రంగ మార్తాండ సినిమా ముంబయి ఇండియన్స్ టీమ్ కు సెట్ అవుతుందేమో. పాపం కష్టపడుతున్నారు. చూడాలి ఫలితం ఎలా ఉంటుందో.

పంజాబ్ కింగ్స్ జట్టుకు శాకుంతలం సినిమా పేరు సరిగా ఉంటుంది. పాపం.. ఆ ప్రీతి జింటా కోసం అయినా.. ఒక్క కప్ కొట్టండయ్యా అంటారు ఫ్యాన్స్.

బాలయ్య వీరసింహా రెడ్డి సినిమా రాజస్థాన్ రాయల్స్ సినిమాకు సరిపోతుంది. కోసేవాడికి కోడి మీద పగ ఉండదు.. నేనూ అంతే. చాలా పద్ధతిగా నరుకుతా.. అన్నట్టుగా అప్పుడప్పుడు దుమ్ములేపేస్తారు. తొక్కుకుంటూ పోవడమే.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వినరో భాగ్యము విష్ణు కథ సినిమా పేరు సెట్ అవుతుంది. ఈసాల కప్ నమ్దే అని ఇంకా ఎన్నాళ్లు వినాలన్నా అంటుంటారు ఆర్సీబీ ఫ్యాన్స్. ఒక్కసారైనా ఆ మాటను నిజం చేయమని ఫ్యాన్స్ అడుగుతుంటారు.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. సన్ రైజర్స్ హైదరాబాద్.. దసరా సినిమా పేరు సరిపోతుంది. ఎవరు ఉన్నా.. లేకున్నా.. దసరాలో ధరణి లాగా లేచి నరుకుతాం అనే విధంగా ఉంటారు.

WhatsApp channel

సంబంధిత కథనం