Zero Shadow Day: బెంగళూరులో ఏప్రిల్ 25న ‘జీరో షాడో డే’: విశేషమేంటంటే!
Zero Shadow Day: ఏప్రిల్ 25న బెంగళూరులో జీరో షాడో డే ఏర్పడనుంది. కొన్ని సెకన్ల పాటు నీడలు కనుమరుగు అవుతాయి.
Zero Shadow Day: ఓ ప్రత్యేకమైన ఖగోళ సంఘటనకు ఏప్రిల్ 25న బెంగళూరు నగరం సాక్ష్యంగా నిలువనుంది. కాసేపు ఈ అరుదైన జీరో షాడో డే ఉండనుంది. అంటే కొన్ని క్షణాల పాటు బెంగళూరులో నిటారై వాటికి నీడపడదు. ఆ సెకన్లలో జీవులు, వస్తువులతో పాటు వేటికి కూడా నీడ కనిపించదు. అందుకే దీన్ని జీరో షాడో డేగా పిలుస్తారు. ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 12:17 గంటలకు కొన్ని సెకన్ల పాటు ఈ అరుదైన విషయం జరగనుంది. ఈ సందర్భంగా బెంగళూరులోని కోరమంగళ వద్ద ఉన్న క్యాంపస్‍లో ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) ఓ ఈవెంట్ నిర్వహించనుంది. ఈ ఈవెంట్‍కు సంబంధించిన వివరాలను ఇప్పటికే కొందరు ట్వీట్లు చేస్తున్నారు. నీడలేని కొన్ని క్షణాల కోసం వేచిచూస్తున్నారు.
జీరో షాడో డే అంటే..
Zero Shadow Day: మధ్యాహ్నం వేళ సూర్యుడు ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో భూమిపై నీడలు కనిపించవు. ఆ అసాధారణ సమయాన్ని జీరో షాడో డేగా ఆస్ట్రో నామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ASI) పేర్కొంది. ఓ ప్రాంతంలో జీరో షాడో డే సంవత్సరంలో రెండుసార్లు కొన్ని సెకన్ల పాటు సంభవిస్తుందని ASI పేర్కొంది. కర్కాటక, మకరరేఖల మధ్య ఉన్న ప్రాంతాల్లో ఇది సంభవిస్తుంది. ఈ ప్రాంతాల్లో నివసించే వారికి ఉత్తరాణం, దక్షిణాయణంలో సూర్యుడి కాంతి క్షీణత అక్షాంశానికి సమానంగా కొన్ని సెకన్లు ఉంటుంది. దీంతో కొన్ని క్షణాలు నీడలు కనిపించవు.
Zero Shadow Day: సూర్యుడి చుట్టూ భూమి భ్రమించే క్రమంలో భ్రమణ అక్షం 23.5 డిగ్రీలు వంగిపోతుంది. ఈ క్రమమే రుతువుల మార్పునకు కారణం అవుతుంది. ఈ సమయంలో సూర్యుడు అత్యంత ఎత్తైన ప్రదేశం అంటే నడినెత్తి మీదికి వస్తాడు. 23.5 డిగ్రీల వంకరగా భూ భ్రమణ అక్షం ఉన్న సమయంలో ఉత్తరాయణంలో ఓసారి, దక్షిణాయణంలో ఓసారి కొన్ని సెకన్ల పాటు సూర్యుడు సరిగ్గా మధ్యలోకి వస్తాడు. దీన్ని జెనిత్ పొజిషన్ అని అంటారు. మకర రాశి, కర్కాటక రాశి +23.5, -23.5 డిగ్గీల అక్షాంశాల మధ్య ఉన్న సమయంలో ఇది జరుగుతుందని అస్ట్రోనామికల్ సొసైట్ ఆఫ్ ఇండియా (ASI) తెలుపుతోంది. 23.5 డిగ్రీల ఉత్తర, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఉండే ప్రాంతాల్లో ఏడాదికి రెండుసార్లు సూర్యుడి క్షీణత అక్షాంశానికి కొన్ని సెకన్ల పాటు సమానంగా ఉంటుంది. ఆ సమయంలోనే నీడలు కనిపించవు.
నీడలు కనిపించని ఈ సమయం కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఉంటుంది. అయితే, దీని ప్రభావాన్ని నిముషంన్నర వరకు చూడవచ్చు.