Waltair Veerayya Leaked in Online: వాల్తేరు వీరయ్యకు పైరసీ సెగ.. విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీక్
Waltair Veerayya Leaked in Online: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రానికి పైరసీ సెగ తగిలింది. విడుదలకు కొన్ని గంటల ముందే ఈ సినిమా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Waltair Veerayya Leaked in Online: మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబోలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అభిమానులు ఈ సినిమాకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. తెలుగులోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు పైరసీ సెగ తగిలింది. సినిమా రిలీజ్‌కు కొన్ని గంటల ముందే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. కొంతమంది లీకు వీరులు వాల్తేరు వీరయ్య చిత్రాన్ని ఆన్‌లైన్‌లో లీక్ చేశారు.
వాల్తేరు వీరయ్య చిత్రం ఫుల్ హెచ్‌డీ వెర్షన్‌ను వివిధ రకాల టొరెంటో సైట్లలో అందుబాటులో ఉంటచారు. ఫిల్మీ జిల్లా, ఫిల్మీ వ్యాప్, ఆన్‌లైన్ మూవీ వాచెస్, 123 మూవీస్ లాంటి వెబ్‌పోర్టల్‌లో ఈ సినిమాను లీక్ చేశారు. వాల్తేరు వీరయ్య ఫ్రీ డౌన్ లౌడ్, వాల్తేరు వీరయ్య టెలిగ్రాం లింక్స్ అనే కీవర్డ్స్‌తో ఈ సినిమాను ఎంపీ4 క్లారిటీతో డౌన్‌లోడ్ చేసుకునేలా పొందుపరిచారు. ఎంపీ4 నుంచి 1080p, 720p, 480p, 360p, 240p, HD క్లారిటీలో ఇది అందుబాటులో ఉంచడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పైరసీ సైట్లపై మండిపడుతున్నారు.
ఇటీవల కాలంలో పైరసీ సెగ చాలా సినిమాలకు తగులుతోంది. ఇటీవలే విడుదలైన వారిసు, తునివు, వీరసింహారెడ్డి చిత్రాలు ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. తాజాగా ఈ జాబితాలో వాల్తేరు వీరయ్య వచ్చి చేరింది. దీంతో పైరసీ భూతాన్ని విడనాడాల్సిందిగా చిత్రబృందం, ప్రముఖులు ప్రేక్షకులను కోరుకుంటున్నారు.
బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మన మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేసింది. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం.