Waltair Veerayya Review : 'వాల్తేరు వీరయ్య' రివ్యూ.. పూనకాలు లోడింగ్ అయ్యాయా?-waltair veerayya review megastar chiranjeevi ravi teja and shruti hasan waltair veerayya movie review and rating ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Waltair Veerayya Review : 'వాల్తేరు వీరయ్య' రివ్యూ.. పూనకాలు లోడింగ్ అయ్యాయా?

Waltair Veerayya Review : 'వాల్తేరు వీరయ్య' రివ్యూ.. పూనకాలు లోడింగ్ అయ్యాయా?

Anand Sai HT Telugu
Jan 13, 2023 12:26 PM IST

Waltair Veerayya Movie Review : అసలే సంక్రాంతి.. ఆపై చిరంజీవి సినిమా. అందులో రవితేజ. దీంతో 'వాల్తేరు వీరయ్య' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ నటించిన ఈ చిత్రంతో ప్రేక్షకులకు పూనకాలు లోడింగ్ అయ్యాయా?

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య (twitter)

నటీనటులు : చిరంజీవి, రవితేజ, శృతిహాసన్, కేథరిన్, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్ రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌, సినిమాటోగ్రఫీ : ఆర్థర్‌ ఎ.విల్సన్‌, ఎడిటింగ్‌ : నిరంజన్‌ దేవరమన్నె, నిర్మాత: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, స్క్రీన్‌ప్లే : కోన వెంకట్‌, కె.చక్రవర్తి, దర్శకత్వం: బాబీ (కె.ఎస్‌.రవీంద్ర)

మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి బరిలో నిలిచింది. అంతేకాదు.. ఓ ఫ్యాన్ చిరంజీవిని డైరెక్ట్ చేశాడు. బాస్ ను ఎలా చూపించాలో తెలుసు అంటూ.. మెుదటి నుంచి చెప్పుకొస్తున్నాడు బాబీ. మరోవైపు 2000 సంవత్సరంలో వచ్చిన అన్నయ్య తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి నటించిన సినిమా.. భారీ అంచనాలతో జనవరి 13న విడుదలైంది. ట్రైలర్, పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఇంతకీ వాల్తేరు వీరయ్య సినిమా ఎలా ఉంది?

కథ :

వైజాగ్ లోని జాలర్లపేటలో ఉంటాడు వాల్తేరు వీరయ్య(చిరంజీవి). తన చుట్టూ ఉన్నవాళ్లకు సాయం చేస్తుంటాడు. ఓ రోజు నేవీ అధికారులకు సైతం సాయం చేస్తాడు. అప్పటికే ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్ సోలొమాన్ సీజర్ (బాబీ సింహా) అనుకోని పరిస్థితుల్లో సీతాపతి (రాజేంద్ర ప్రసాద్) పని చేస్తున్న స్టేషన్ కు వస్తాడు. అయితే రాత్రిరాత్రే తప్పించుకుని మలేషియా వెళ్లిపోతాడు. దీంతో సీతాపతి సస్పెండ్ అవుతాడు. వీరయ్య గురించి తెలిసిన సీతాపతి.. వెళ్లి సాయం కోరతాడు. డబ్బులు ఇస్తానని, సోలొమాన్ ను ఎలాగైనా మలేషియా నుంచి తీసుకురావాలని చెబుతాడు.

ఇక వీరయ్య తన గ్యాంగ్ తో మలేషియా వెళ్తాడు. కట్ చేస్తే.. వీరయ్య మలేషియా వచ్చింది.. సోలోమన్ ను పట్టుకునేందుకు కాదని తెలుస్తోంది. అతడి అన్నయ్య కాలా అలియాస్ మైఖేల్ సీజర్(ప్రకాశ్ రాజ్) ను అని తెలుస్తోంది. ఇంతకి మైఖేల్ కు, వీరయ్యకి ఉన్న సంబంధం ఏంటి? విక్రమ్ సాగర్(రవి తేజ) పాత్ర ఏంటి? రవితేజ ఎవరికి సాయం చేశాడు? ఏమయ్యాడు? మైఖేల్ ను పట్టుకునేందుకు మలేషియా వెళ్లడానికి కారణమైన వాల్తేరు వీరయ్య గతమేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ఎలా ఉందంటే?

చిరంజీవి బెస్ట్ లుక్స్, మ్యానరిజమ్స్ సినిమాలో ఆకట్టుకుంటాయి. చాలా రోజుల తర్వాత మాస్ పాత్రలో అలరించాడు చిరు. రంగు రంగుల చొక్కలు వేశాడు. డ్యాన్సులు కూడా ఉన్నాయి. యాక్షన్ బ్లాక్స్, మెగాస్టార్ ఇంట్రడక్షన్ బాగుంటుంది. చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలోనూ ఉంది. రవితేజ స్క్రీన్ ప్రెజన్స్, ఎనర్జీ సినిమాకు ప్లస్ పాయింట్. చిరంజీవితో కాంబినేషన్ సీన్స్, సెంటిమెంట్స్ కొన్ని బాగున్నాయి. సముద్రంలో కొన్ని సీన్స్ బాగుంటాయి. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది. చిరంజీవి, రవితేజ కనిపించినప్పుడల్లా స్క్రీన్ నిండుగా ఉంటుంది.

హీరోయిన్ శృతిహసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేనట్టుగా అనిపిస్తుంది. రవితేజ తెలంగాణ యాసలో సహజత్వం లేదు. దీంతో కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది. దర్శకుడు బాబీ.. ఓ అభిమానిగా చిరంజీవిని మాస్ లుక్ లో ఎలా చూపించాలో చూపించాడు. కానీ తెలిసిన కథనే చెప్పాడు. రోటిన్ ఫార్ములా కథ. రవితేజకు భార్యగా క్యాథరిన్ నటించింది. వాళ్లిద్దరి మధ్య బాండింగ్ పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు. చిరంజీవి చిన్నప్పటి సీన్స్ కూడా.. పెద్దగా ప్రభావం చూపించవు. వాల్తేరు వీరయ్య కథకు చిన్నప్పటి కథ కూడా ముఖ్యమే.. అది సరిగా ప్రజెంట్ చేయలేదు.

సినిమాలోను ఇతర నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించాడు. శృతిహసన్ పాత్ర సినిమాలో కీలకం. కానీ జస్టిఫికేషన్ లేదేమో అనిపిస్తుంది. కేథరీన్ తనకు లభించిన లిమిటెడ్ సీన్స్ లో పర్వాలేదనిపించుకుంది. బాబీ సింహా విలన్ గా ఆకట్టుకున్నాడు. నిజానికి ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్. కానీ సరిగా ఎలివేట్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ, మ్యూజిగా బాగానే ఉన్నాయి.

దర్శకుడు బాబీ.. సింపుల్ రివెంజ్ స్టోరీతో.. అలరించే ప్రయత్నం చేశాడు. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా నడుస్తుంది. ఓవరాల్ గా చిరంజీవి సినిమా నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో.. అవి ప్యాక్ చేసి తీసుకొచ్చాడు దర్శకుడు. మాస్ ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తారు.

రేటింగ్ : 2.75/ 5

IPL_Entry_Point