Cricket: తొమ్మిదేళ్ల తర్వాత అమ్మను కలిశా.. ముంబయి ఇండియన్స్ ప్లేయర్ భావోద్వేగం-mumbai indians player kumar karthikeya met hid mother after 9 years ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cricket: తొమ్మిదేళ్ల తర్వాత అమ్మను కలిశా.. ముంబయి ఇండియన్స్ ప్లేయర్ భావోద్వేగం

Cricket: తొమ్మిదేళ్ల తర్వాత అమ్మను కలిశా.. ముంబయి ఇండియన్స్ ప్లేయర్ భావోద్వేగం

Maragani Govardhan HT Telugu
Aug 04, 2022 08:44 PM IST

ముంబయి ఇండియన్స్ ఆటగాడు కుమార్ కార్తికేయ 9 ఏళ్ల తర్వాత తన తల్లిని కలుసుకున్నాడు. జీవితంలో ఏదైనా సాధించేంత వరకు ఇంటికి వెళ్లకూడదని ప్రతినబూనిన ఇతడు ఎట్టకేలకు స్వగృహానికి వచ్చాడు.

<p>9 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన ముంబయి ప్లేయర్</p>
9 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన ముంబయి ప్లేయర్ (Twitter)

తల్లిదండ్రులకు దూరంగా ఉండాలంటే అంతకంటే నరకం మరోకటి ఉండదు. చిన్నప్పటి నుంచి అమ్మ, నాన్నలతో కలిసి ఉంటూ ఒక్కసారిగా వారి నుంచి దూరంగా ఉండాలంటే ఎంతో బాధేస్తుంది. అయితే తల్లిదండ్రులకు ఓ నెల, రెండు నెలలో దూరంగా ఉండి వెంటనే వారిని చూడాలని తహతహలాడుతుంటారు. ఎంత అత్యవసర పరిస్థితులున్నప్పటికీ ఏడాదికోసారైనా అమ్మ, నాన్నలను కలవాలనుకుంటారు. కానీ ముంబయి ఇండియన్స్ క్రికెటర్ ఏకంగా 9 ఏళ్ల పాటు కన్నవారికి దూరంగా ఉన్నాడు. కుమార కార్తికేయ అనే క్రికెటర్ తను జీవితంలో ఏదైనా సాధించేంత వరకు వారిని కలవాలకూడదని నిర్ణయించుకున్నాడు. చివరకు అనుకున్నది సాధించి 9 ఏళ్ల 3 నెలల తర్వాత తన తల్లిని కలిశాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా తెలియజేశాడు.

24 ఏళ్ల ఈ ముంబయి ఇండియన్స్ ప్లేయర్ 9 ఏళ్ల తర్వాత తల్లిని తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

“నేను నా తల్లిని, కుటుంబాన్ని 9 సంవత్సరాల 3 నెలల తర్వాత కలుసుకున్నాను. నా ఫీలింగ్స్‌ను బయటకు చెప్పలేకపోతున్నా."" అంటూ ట్విటర్ వేదికగా స్పష్టం చేశాడు.

కార్తికేయ ఈ ఏడాది మేలో జరిగిన ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత తను ఇంటికి వెళ్తానని అప్పుడే చెప్పాడు. జీవితంలో ఏదైనా సాధించేంత వరకు తాను ఇంటికి వెళ్లకూడదనుకున్నానని, చివరకు అనుకున్నది సాధించి స్వగృహానికి చేరానని స్పష్టం చేశాడు.

“నేను 9 సంవత్సరాల నుంచి ఇంటికి వెళ్లలేదు. జీవితంలో ఏదైనా సాధించిన తర్వాతే ఇంటికి వెళ్దామని నిర్ణయించుకున్నాను. మా అమ్మ, నాన్న ఇంటికి రమ్మని తరచూ అడిగేవారు. కానీ ఈ విషయంలో సీరియస్‌గా నిశ్చయించుకున్నానని తెలిపాను. ఐపీఎల్‌లో కనిపించన నేను ఎట్టకేలకు ఇంటికి వెళ్దామని భావించాను. తొలి ఏడాది మా కోచ్ సంజయ్ సర్ మధ్యప్రదేశ్‌కు ఆడమని సూచించారు. అనంతరం అండర్-23 జట్టులో స్టాండ్‌బై ప్లేయర్‌గా అవకాశమొచ్చింది. ఆ జాబితాలో నా పేరు రావడం నాకు పెద్ద ఉపశమనం లభించింది." అని కుమార్ కార్తికేయ తెలిపాడు.

ఈ 24 ఏళ్ల బౌలర్ 2018లో తొలిసారిగా తన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను ఆడాడు. సంప్రదాయ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా ఎదిగాడు. అయితే ఈ ఏడాది ముంబయి ఇండియన్స్‌లో అవకాశమొచ్చేంత వరకు అతడికి సరైన గుర్తింపు లభించలేదు. ఏప్రిల్ 30న డీవై పాటిల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడి 7.85 సగటుతో 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్