తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Points Table: కోల్‌క‌తాపై విజయంతో టాప్ సెవ‌న్‌లోకి స‌న్‌రైజ‌ర్స్ - ఆరెంజ్ క్యాప్‌లో ధావ‌న్‌తో వార్న‌ర్ పోటీ

IPL 2023 Points Table: కోల్‌క‌తాపై విజయంతో టాప్ సెవ‌న్‌లోకి స‌న్‌రైజ‌ర్స్ - ఆరెంజ్ క్యాప్‌లో ధావ‌న్‌తో వార్న‌ర్ పోటీ

15 April 2023, 9:36 IST

google News
  • IPL 2023 Points Table: ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో నంబ‌ర్ వ‌న్ ప్లేస్ కోసం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య గ‌ట్టిపోటీ నెల‌కొంది. అలాగే ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌ల‌ ధావ‌న్‌తో వార్న‌ర్ పోటీప‌డుతోన్నాడు. ప‌ర్పుల్ క్యాప్ లీడ‌ర్స్‌లో స్పిన్న‌ర్ల‌దే హ‌వా కొన‌సాగుతోంది.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్

IPL 2023 Points Table: శుక్ర‌వారం జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌క‌తాపై అద్భుత విజ‌యాన్ని సాధించిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో రెండు స్థానాలు పైకి ఎగ‌బాకింది. తొమ్మిదో స్థానం నుంచి ఏడో ప్లేస్‌కు చేరుకున్న‌ది. మ‌రోవైపు పాయింట్స్ టేబుల్ లో నంబ‌ర్ వ‌న్ ప్లేస్ కోసం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, ల‌క్సో సూప‌ర్ జెయింట్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ నువ్వా నేనా అన్న‌ట్లుగా పోటీప‌డుతోన్నాయి. నాలుగు మ్యాచుల్లో మూడు విజ‌యాల‌తో మూడు టీమ్‌లు ఆరు పాయింట్లు సాధించాయి.

అయితే ర‌న్‌రేట్ ప్ర‌కారం రాజ‌స్థాన్‌ (+1.585) టాప్ ప్లేస్‌లో నిల‌వ‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సెకండ్‌, గుజ‌రాత్ టైటాన్స్ మూడో స్థానంలో ఉన్నాయి. నాలుగు మ్యాచుల్లో రెండేసి విజ‌యాల‌తో కోల్‌క‌తా నాలుగో స్థానంలో ఉండ‌గా చెన్నై ఐదో ప్లేస్‌లో నిలిచింది. ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో విజ‌యాల ఖాతా తెర‌వ‌ని ఢిల్లీ అట్ట‌డుగు స్థానాన్ని ద‌క్కించుకుంది.

ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌

ఆరెంజ్ క్యాప్‌లో ధావ‌న్ వ‌ర్సెస్ వార్న‌ర్‌

ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో ధావ‌న్‌, వార్న‌ర్ మ‌ధ్య పోటీ నెల‌కొంది. ఆరెంజ్ క్యాప్ లీడ‌ర్స్‌లో 4 మ్యాచుల్లో 223 ర‌న్స్‌తో ధావ‌న్ టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతోండ‌గా వార్న‌ర్ 4 మ్యాచుల్లో 209 ర‌న్స్‌తో సెకండ్ ప్లేస్ ద‌క్కించుకున్నాడు. త‌ర్వాతి స్థానాల్లో బ‌ట్ల‌ర్ (204 ర‌న్స్‌), (గైక్వాడ్‌(197 ర‌న్న్‌) ఉన్నారు.

ఆరెంజ్ క్యాప్ లీడ‌ర్స్‌

ప‌ర్పుల్ క్యాప్‌లో చాహ‌ల్ టాప్‌

ప‌ర్పుల్ క్యాప్ లీడ‌ర్స్ లిస్ట్‌లో స్పిన్న‌ర్ల‌దే హ‌వా సాగుతోంది. ప‌ది వికెట్ల‌తో చాహ‌ల్ మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకోగా ర‌షీద్‌ఖాన్ 9 వికెట్ల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతోన్నాడు. పేస‌ర్లు మార్క‌వుడ్ (తొమ్మిది వికెట్లు), అల్జారీ జోసెఫ్ (7 వికెట్లు)తో మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు.

తదుపరి వ్యాసం