Warner Plays Street Cricket: ముంబైలో గ‌ల్లీ క్రికెట్ ఆడిన వార్న‌ర్ - వీడియో వైర‌ల్ -david warner plays street cricket in mumbai video goes viral on social media
Telugu News  /  Sports  /  David Warner Plays Street Cricket In Mumbai Video Goes Viral On Social Media
 డేవిడ్ వార్న‌ర్‌
డేవిడ్ వార్న‌ర్‌

Warner Plays Street Cricket: ముంబైలో గ‌ల్లీ క్రికెట్ ఆడిన వార్న‌ర్ - వీడియో వైర‌ల్

16 March 2023, 13:14 ISTNelki Naresh Kumar
16 March 2023, 13:14 IST

Warner Plays Street Cricket: ముంబైలో కొంద‌రు కుర్రాళ్ల‌తో క‌లిసి గ‌ల్లీ క్రికెట్ ఆడాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Warner Plays Street Cricket: మోచేయి గాయంతో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్ నుంచి అర్ధాంత‌రంగా వైదొలిగాడు ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌. విశ్రాంతి కోసం ఆస్ట్రేలియా వెళ్లిపోయిన వార్న‌ర్ తిరిగి ఇటీవ‌లే ఇండియా వ‌చ్చాడు. శుక్ర‌వారం నుంచి ఇండియాతో మొద‌లుకానున్న మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌కు వార్న‌ర్ ఎంపిక‌య్యాడు.

ఈ వ‌న్డే సిరీస్ కోసం రెండు, మూడు రోజ‌లు ముందే ఇండియా చేరుకున్నాడు వార్న‌ర్‌. తొలి వ‌న్డే ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రుగ‌నుంది. ఈ వ‌న్డే మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా టీమ్ ముంబై చేరుకుంది.

మ్యాచ్‌కు ముందు విరామం ల‌భించ‌డంతో త‌న ఫ్యామిలీతో క‌లిసి ముంబై వీధుల్లో వార్న‌ర్ చ‌క్క‌ర్లు కొట్టాడు. ముంబైల లోని ఓ వీధిలో కుర్రాళ్ల‌తో క‌లిసి గ‌ల్లీ క్రికెట్ ఆడాడు వార్న‌ర్‌. గ‌ల్లీ క్రికెట్ ఆడుతోన్న వీడియోను వార్న‌ర్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇందులో ఓ యువ‌కుడు వేసిన బాల్‌ను డిఫెన్స్ ఆడుతూ వార్న‌ర్ క‌నిపించాడు. వార్న‌ర్ గ‌ల్లీ క్రికెట్ ఆడుతోన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోకి మూడు మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్ వ‌చ్చాయి.

ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్‌ను ఇండియ‌న్స్ ఎందుకు ఆరాధిస్తారో మిమ్మ‌ల్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది అంటూ వార్న‌ర్ పోస్ట్ చేసిన‌ వీడియోను ఉద్దేశించి ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఇంట‌ర్‌నేష‌న్ క్రికెట్ కంటే గ‌ల్లీ క్రికెట్ ఆడ‌టం ఎంత క‌ష్ట‌మో వార్న‌ర్‌కు అర్థ‌మై ఉంటుంద‌ని మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశాడు.