SRH vs PBKS: స‌న్‌రైజ‌ర్స్ ఫ‌స్ట్ విక్ట‌రీ - పంజాబ్ ఓడినా ధావ‌న్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు-srh register first win in ipl 2023 season against punjab kings ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Srh Register First Win In Ipl 2023 Season Against Punjab Kings

SRH vs PBKS: స‌న్‌రైజ‌ర్స్ ఫ‌స్ట్ విక్ట‌రీ - పంజాబ్ ఓడినా ధావ‌న్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

Nelki Naresh Kumar HT Telugu
Apr 10, 2023 06:29 AM IST

SRH vs PBKS: ఐపీఎల్ 2023లో స‌న్‌రైజ‌ర్స్ తొలి విజ‌యాన్ని అందుకున్న‌ది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

శిఖ‌ర్‌ ధావ‌న్‌
శిఖ‌ర్‌ ధావ‌న్‌

SRH vs PBKS: ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ బోణీ చేసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌పైఎనిమిది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. బౌలింగ్‌లో మ‌యాంక్ మార్కాండే , బ్యాటింగ్‌లో రాహుల్ త్రిపాఠి రాణించ‌డంతో హైద‌రాబాద్ అద్భుత విజ‌యాన్ని సొంతం చేసుకున్న‌ది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 143 ప‌రుగులు చేసింది. ధావ‌న్ 99 ర‌న్స్‌తో ఒంట‌రి పోరాటం చేశాడు. పంజాబ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని 17 ఓవ‌ర్ల‌లోనే స‌న్‌రైజ‌ర్స్ ఛేదించింది. మ‌రోసారి హ్యారీ బ్రూక్ విఫ‌లం కావ‌డం, మ‌యాంక్ అగ‌ర్వాల్ కూడా త‌క్కువ స్కోరుకే ఔట్ కావ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ స్వ‌ల్ప టార్గెట్‌ను కూడా ఛేదిస్తుందా లేదా అని అభిమానులు సందేహ‌ప‌డ్డారు.

కానీ రాహుల్ త్రిపాఠి, మార్‌క్ర‌మ్ క‌లిసి స‌న్‌రైజ‌ర్స్‌ను గెలుపుబాట ప‌ట్టించారు. మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతూనే ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో పంజాబ్ క‌థ‌ను ముగించారు. రాహుల్ త్రిపాఠి 48 బాల్స్‌లో ప‌ది ఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో 74 ర‌న్స్ చేయ‌గా మార్‌క్ర‌మ్ 21 బాల్స్‌లో ఆరు ఫోర్ల‌తో 37 ర‌న్స్ చేశాడు.

పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్ మిన‌హా మిగిలిన వారంద‌రూ తేలిపోయారు. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓట‌మి పాలైన అస‌మాన ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకొన్న శిఖ‌ర్‌ధావ‌న్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

WhatsApp channel