IND vs ENG: రాణించిన హార్దిక్, చాహల్...259 రన్స్‌కు ఇంగ్లాండ్ ఆలౌట్
మూడో వన్డేలో టీమ్ ఇండియా బౌలర్లు హార్దిక్ పాండ్య,చాహల్ చెలరేగడంతో ఇంగ్లాండ్ 45.5 ఓవర్లలో 259 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు.
మంచెస్టర్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు చెలరేగారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యతో పాటు స్పిన్నర్ చాహల్కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 45.5 ఓవర్లలో ఇంగ్లాండ్ 259 రన్స్ ఆలౌట్ అయ్యింది. ఇండియా ముందు 260 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఇండియా...ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన పేసర్ సిరాజ్ తనకు లభించిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఒకే ఓవర్ లో కీలక ఆటగాళ్లు బెయిర్‌స్టో,జో రూట్ వికెట్లు తీసి ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చాడు. ఓపెనర్ జేసన్ రాయ్‌తో కలిసి కెప్టెన్ బట్లర్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరు యాభై పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. జేసన్‌రాయ్‌ని ఔట్ చేసి హార్దిక్ ఈ జోడిని విడగొట్టాడు. హార్దిక్ లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంలో ఇంగ్లాండ్ సింగిల్స్ రాబట్టడానికే కష్టపడింది. తొలి నాలుగు ఓవర్లలో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన హార్దిక్ రెండు వికెట్లు తీశాడు. జోస్ బట్లర్,మెయిన్ అలీ కలిసి ఇంగ్లాండ్ స్కోరును 150కి చేరువ చేశారు. 34 రన్స్ చేసిన మెయిన్ అలీని జడేజా వెనక్కి పంపాడు.
లివింగ్‌స్టోన్ (31 బాల్స్ లో 27 రన్స్) ధాటిగా ఆడటంతో ఇంగ్లాండ్ స్కోరు వేగం పెరిగింది. అతడిని చక్కటి డెలివరీతో హార్దిక్ పెవిలియన్ చేర్చాడు. బట్లర్ ఔట్ తర్వాత ఇంగ్లాండ్ టెయిలెండర్లు కూడా పెవిలియన్ కు క్యూ కట్టారు. 80 బాల్స్‌లో రెండు సిక్సర్లు మూడు ఫోర్లతో అరవై పరుగులు చేశాడు బట్లర్. టీమ్ ఇండియా బౌలర్లలో హార్ధిక్ పాండ్య ఏడు ఓవర్లు వేసి 24 రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అందులో మూడు మెయిడిన్లు ఉండటం గమనార్హం. హార్దక్ వన్డే కెరీర్‌లో ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం గమనార్హం. చాహల్ 3,సిరాజ్ 2,జడేజా ఒక వికెట్ దక్కించుకున్నారు.
సంబంధిత కథనం
టాపిక్