తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Mohammed Siraj : కోహ్లీ-గంభీర్ గొడవకు అసలు కారణం ఇదేనట..

Mohammed Siraj : కోహ్లీ-గంభీర్ గొడవకు అసలు కారణం ఇదేనట..

Anand Sai HT Telugu

02 May 2023, 13:06 IST

google News
    • Virat Kohli-Gautam Gambhir : విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, నవీన్ ఉల్ హక్ మధ్య గొడవకు ప్రధాన కారణం ఏమిటి? ఈ పోరు ఎక్కడ మొదలైంది? అని అందరూ చర్చించుకుంటున్నారు. అసలు ఈ గొడవ సిరాజ్ దగ్గర నుంచి మెుదలైందట.
లక్నో వర్సెస్ బెంగళూరు
లక్నో వర్సెస్ బెంగళూరు

లక్నో వర్సెస్ బెంగళూరు

IPL 2023 : ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో సోమవారం లక్నో సూపర్ జెయింట్స్(lucknow super giants), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (LSGVSRCB) మధ్య జరిగిన మ్యాచ్ వార్తల్లో నిలిచింది. మ్యాచ్ అనంతరం జరిగిన సంఘటనలు వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా ఆర్‌సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli), ఎల్‌ఎస్‌జీ మెంటర్ గౌతం గంభీర్(Gautham Gambhir) మధ్య గొడవ మీద చర్చ నడుస్తోంది. లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్‌తో కోహ్లీ వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఈ గొడవకు ప్రధాన కారణం ఏంటి? గొడవ ఎక్కడ నుంచి మొదలైంది? అనే విషయంపై మరో విషయం బయటకు వచ్చింది.

లక్నో బ్యాటింగ్‌ 17వ ఓవర్‌లో ఈ పోరు మొదలైంది. ఈ సందర్భంగా క్రీజులో అమిత్ మిశ్రా, నవీల్ ఉల్ హక్(naveen ul haq) ఉన్నారు. లక్నో 16 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. 17వ ఓవర్ వేయడానికి మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) వచ్చాడు. ఈ ఓవర్ తొలి 5 బంతుల్లో సిరాజ్ 8 పరుగులు ఇచ్చాడు. చివరి బంతికి ఫ్రీ హిట్‌ అయింది. అయితే ఫ్రీ హిట్‌ను ఎదుర్కోవడంలో నవీన్ విఫలమవడంతో అది డాట్ బాల్ అయింది. తర్వాత సిరాజ్ బంతిని అందుకుని నవీన్ వైపు చూశాడు. అంతే కాకుండా నవీన్ క్రీజులో ఉన్నా.. బంతిని వికెట్‌కి విసిరాడు.

ఈ సందర్భంగా సిరాజ్-నవీన్(Siraj Naveen Fight) మధ్య స్వల్ప స్థాయిలో మాటల వాగ్వాదం జరిగింది. ఇక విరాట్ కోహ్లీ కూడా జోక్యం చేసుకోవడంతో ఇక్కడి నుంచే పోరు మొదలైంది. అమిత్ మిశ్రా(amit mishra) వచ్చి కోహ్లీని శాంతింపజేసే ప్రయత్నం చేశాడు. కానీ, కోహ్లి మిశ్రాపై విరుచుకుపడ్డాడు. ఘటనను అంపైర్‌కు వివరిస్తుండగా కోహ్లీ సహనం కోల్పోయాడు. చివర్లో కోహ్లీ తన షూ డస్ట్‌ని నవీన్‌కి చూపించాడు. 18వ ఓవర్ లోనూ కోహ్లి, నవీన్ మధ్య పోరు కొనసాగింది. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ్యాచ్ మధ్యలో జరిగిన పోరు మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కొనసాగింది. కరచాలనం సందర్భంగా కోహ్లీ-నవీన్ మళ్లీ ముఖాముఖిగా వచ్చారు. అప్పుడు కూడా ఇద్దరి మధ్య మాటల వాగ్వాదం జరిగింది. అప్పుడు మాక్స్‌వెల్ వారిద్దరినీ ఆపి పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. తర్వాత విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్‌(KL Rahul)తో మాట్లాడుతుండగా, నవీన్ ఉల్ హక్ కోహ్లీకి దగ్గరగా వెళ్లాడు. తర్వాత రాహుల్ నవీన్ ని రమ్మని అడిగాడు. అయితే దీనికి ఒప్పుకోని నవీన్.. కోహ్లీ ముఖం కూడా చూడకుండా అతనితో మాట్లాడేందుకు నిరాకరించాడు.

మైదానంలో జరిగిన అన్ని విషయాలతో ఆగ్రహించిన గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీతో కూడా వాగ్వాదానికి(virat Kohli Gautham Gambhir Contraversy) దిగాడు. పరిస్థితి చేయి దాటిపోవడంతో ఇరు జట్ల ఆటగాళ్లు జోక్యం చేసుకున్నారు. ఎల్‌ఎస్‌జీ ప్లేయర్ ఖిల్ మేయర్స్‌తో కోహ్లీ మాట్లాడుతుండగా, గంభీర్ జోక్యం చేసుకుని మేయర్స్‌ని తీసుకెళ్లాడు. ఇక్కడి నుంచి కోహ్లీ-గంభీర్ పోరు(Kohli Gambhir Fight) మొదలైంది. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కోహ్లీ, గంభీర్, నవీన్‌లకు జరిమానా విధించారు.

తదుపరి వ్యాసం