తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rcb Vs Lsg : లక్నో, బెంగళూరు మ్యాచ్ మళ్లీ ఎప్పుడు? ఇంతకీ తలపడనున్నాయా?

RCB vs LSG : లక్నో, బెంగళూరు మ్యాచ్ మళ్లీ ఎప్పుడు? ఇంతకీ తలపడనున్నాయా?

Anand Sai HT Telugu

03 May 2023, 8:57 IST

    • IPL 2023 : RCB vs LSG తదుపరి మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కోహ్లీ-గంభీర్ గొడవతో ఈ రెండు జట్లు మళ్లీ ఎప్పుడు తలపడుతాయా అని ఆసక్తితో ఉన్నారు. అయితే మళ్లీ RCB vs LSG మ్యాచ్ జరుగుతుందా?
లక్నో వర్సెస్ బెంగళూరు
లక్నో వర్సెస్ బెంగళూరు (twitter)

లక్నో వర్సెస్ బెంగళూరు

ఐపీఎల్ 2023లో కోహ్లీ-గంభీర్(Kohli Vs Gambhir) మధ్య జరిగిన గొడవ హైలెట్ అయింది. దీని మీద చర్చ జరుగుతూనే ఉంది. లక్నో టీమ్, బెంగళూరు టీమ్ మ్యాచ్ అనంతరం జరిగిన వివాదం మీద ఎవరో ఒకరు కామెంట్ చేస్తూనే ఉన్నారు. దీంతో మళ్లీ వీళ్లిద్దరీ మ్యాచ్ ఎప్పుడు ఉంటుందనేది ఆసక్తిగా మారింది. అయితే RCB vs LSG మ్యాచ్ జరిగే అవకాశం ఉందా?

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

RCBకి ఇప్పుడు లక్నో సూపర్‌జెయింట్స్(lucknow super giants) కొత్త ప్రత్యర్థిగా మారింది. దీనికి కారణం ఏప్రిల్ 10న బెంగళూరులో RCB vs LSG మధ్య జరిగిన మ్యాచ్. మ్యాచ్‌లో 1 వికెట్‌తో విజయం సాధించడంతో లక్నో ఆటగాళ్లు మైమరచిపోయి సంబరాలు చేసుకున్నారు. అలాగే ఎల్‌ఎస్‌జి జట్టు(LSG Team) మెంటార్ గౌతమ్ గంభీర్ ఆర్‌సీబీ అభిమానులను(RCB Fans) సైలెంట్ గా ఉండమని సైగ చేశాడు. అక్కడ నుంచి వివాదం మెుదలైంది.

అయితే ఈ విషయాన్ని కోహ్లీ మనసులో పెట్టుకున్నాడనేది కొందరి వాదన. అనుకున్నట్టుగానే తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ జట్టును ఓడించి RCB ప్రతీకారం తీర్చుకుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లి(Virat Kohli) మ్యాచ్ గెలిచి.. వేడుక చేసుకున్నాడు. ఆ తర్వాత మాటమాట పెరిగి.. వివాదమైంది. అంతేకాదు.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు.. ప్లేయర్లకు భారీగా జరిమానా విధించారు. కోహ్లీ, గంభీర్ కు 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించగా.. లక్నో ఆటగాడు నవీన్ కు 50 శాతం కోత వేశారు. ఇంతటి ఆసక్తికర ఘటన జరగడంతో లక్నో, బెంగళూరు మ్యాచ్ మళ్లీ ఎప్పుడు ఉంటుందనే దానిపై చర్చ మెుదలైంది.

దీంతో ఇరు జట్ల తదుపరి మ్యాచ్ ఎప్పుడనే విషయంపై గూగుల్ లో సెర్చ్ మొదలైంది. అయితే LSG vs RCB ప్రస్తుతానికి తలపడవు. ఎందుకంటే ఇరు జట్ల లీగ్ దశలో 2 మ్యాచ్‌లు ముగిశాయి. మరేదైనా ప్లేఆఫ్ వరకు ఆగాల్సిందే. అంటే RCB మరియు లక్నో సూపర్‌జెయింట్స్ తదుపరి మ్యాచ్‌లలో గెలిచి లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో కనిపించాలి. ఇది క్వాలిఫైయర్ లేదా ఎలిమినేటర్ మ్యాచ్‌లకు దారితీయవచ్చు.

దీంతో పాటు ఫైనల్‌లోనూ వీరిద్దరూ తలపడే అవకాశం ఉంది. అయితే అంతకు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలి. ఆ తర్వాతే ఇరు జట్ల ముఖాముఖి పోరు ఉంటుంది. ఈ రెండు జట్లు మధ్య పోరు కోసం.. క్రికెట్ అభిమానులు(Cricket Fans) ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మళ్లీ తలపడితే.. ఎవరు గెలిచినా.. సంబరాలు ఎలా చేసుకుంటారనే విషయం ఆసక్తిగా మారింది. లక్నో, బెంగళూరు తలపడతాయో.. లేదో.. వెయిట్ చేయాల్సిందే.

తదుపరి వ్యాసం