DC vs LSG | ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్-lucknow super giants won the toss and elected to bat first against delhi capitals ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dc Vs Lsg | ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్

DC vs LSG | ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్

Hari Prasad S HT Telugu
May 01, 2022 03:05 PM IST

హ్యాట్రిక్‌ విజయాలపై కన్నేసిన లక్నో సూపర్ జెయింట్స్‌.. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ టాస్‌ గెలిచాడు.

ఢిల్లీ, లక్నో కెప్టెన్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్
ఢిల్లీ, లక్నో కెప్టెన్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ (ICC Twitter)

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌. ఈ సీజన్ లో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోవడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. ఈ మ్యాచ్‌కు ఒక మార్పుతో ఆ టీమ్‌ బరిలోకి దిగుతోంది. స్టార్‌ అవేష్ ఖాన్‌ ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అతని స్థానంలో గౌతమ్‌ టీమ్‌లోకి వచ్చాడు. అటు ఢిల్లీ గత మ్యాచ్ ఆడిన టీమ్ తోనే బరిలోకి దిగుతోంది.

ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో లక్నో సూపర్‌ కింగ్స్‌ 3, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరో స్థానంలో ఉన్నాయి. చివరి ఐదు మ్యాచ్‌లలో ఈ రెండు టీమ్స్‌ మూడు మ్యాచ్‌లలో గెలిచి, రెండింట్లో ఓడాయి. చివరి రెండు మ్యాచ్‌లలో ముంబై, పంజాబ్‌లపై గెలిచి లక్నో హ్యాట్రిక్‌ విజయాలపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే లక్నో రెండోస్థానంలోకి వెళ్తుంది. అటు ఢిల్లీ ఈ మ్యాచ్‌ గెలిస్తే నాలుగోస్థానానికి వెళ్లే ఛాన్స్‌ ఉంది.

WhatsApp channel

టాపిక్