తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Eng Vs Ire : బంతి ముట్టలేదు, బ్యాట్ తాకలేదు.. అయినా బెన్ స్టోక్స్ ప్రపంచ రికార్డు!

ENG Vs IRE : బంతి ముట్టలేదు, బ్యాట్ తాకలేదు.. అయినా బెన్ స్టోక్స్ ప్రపంచ రికార్డు!

HT Telugu Desk HT Telugu

04 June 2023, 12:44 IST

google News
    • ENG vs IRE : ఐర్లాండ్, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకుండా, బ్యాట్‌తో ఒక్క పరుగు కూడా చేయకుండా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ఇంగ్లండ్ గెలుపు
ఇంగ్లండ్ గెలుపు

ఇంగ్లండ్ గెలుపు

లార్డ్స్ వేదికగా ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టెస్టు ఆరంభం నుంచి ఐర్లాండ్‌పై ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లిష్‌ ఆటగాళ్లు యాషెస్‌ సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు ఇది చక్కటి అవకాశం.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఒక్క ఓవర్ కూడా వేయకుండా, బ్యాట్‌తో ఒక్క పరుగు కూడా చేయకుండా క్రికెట్ ప్రపంచంలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో కెప్టెన్ గా బ్యాటింగ్, బౌలింగ్ లేదా వికెట్ కీపింగ్ కూడా లేకుండా మ్యాచ్ గెలిచిన తొలి ఆటగాడిగా బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. అలాగే ఈ మ్యాచ్ లో ఏమీ చేయని స్టోక్స్ కు కూడా రూ.16.41 లక్షల మ్యాచ్ ఫీజు అందనుంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు కేవలం 172 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ 4 వికెట్లకు 524 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

ఇంగ్లండ్‌ తరఫున ఓలీ పోప్‌ డబుల్‌ సెంచరీ చేశాడు. ఓలీ పోప్ ఇన్నింగ్స్‌లో 208 బంతుల్లో 22 ఫోర్లు, 3 సిక్సర్లతో 205 పరుగులు చేశాడు. అతడితో పాటు బెన్ డకెట్ 178 బంతుల్లో 182 పరుగులు చేసి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు.

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్ 9 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో హ్యారీ టెక్టర్, ఆండీ మెక్‌బర్నీ మరియు మార్క్ ఈడర్‌లు వరుసగా 51, 86 మరియు 88 పరుగులు చేశారు. ఇంగ్లండ్ తరఫున జోష్ టాంగ్ అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్, జాక్ లీచ్, జో రూట్ ఒక్కో వికెట్ తీశారు.

తదుపరి వ్యాసం