SL vs IRE: శ్రీలంకపై ఐర్లాండ్ సంచలనం.. టెస్టుల్లో అత్యధిక స్కోరు-sl vs ire second test as visitors post their highest test score ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Sl Vs Ire Second Test As Visitors Post Their Highest Test Score

SL vs IRE: శ్రీలంకపై ఐర్లాండ్ సంచలనం.. టెస్టుల్లో అత్యధిక స్కోరు

Hari Prasad S HT Telugu
Apr 25, 2023 06:55 PM IST

SL vs IRE: శ్రీలంకపై ఐర్లాండ్ సంచలనం సృష్టించింది. టెస్టుల్లో తమ అత్యధిక స్కోరు నమోదు చేసింది. రెండో టెస్టులో విజిటింగ్ టీమ్ ఏకంగా 492 రన్స్ చేయడం విశేషం.

ఐర్లాండ్ తరఫున సెంచరీలు బాదిన పాల్ స్టిర్లింగ్, కాంఫర్
ఐర్లాండ్ తరఫున సెంచరీలు బాదిన పాల్ స్టిర్లింగ్, కాంఫర్ (AFP)

SL vs IRE: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఐర్లాండ్ అద్భుతంగా ఆడింది. టెస్టుల్లో తమ అత్యధిక స్కోరు నమోదు చేసింది. బ్యాటింగ్ కు అనుకూలించిన కండిషన్స్ లో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 492 పరుగులకు ఆలౌట్ కావడం విశేషం. తర్వాత రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 81 రన్స్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె 39, నిషాన్ మదుష్క 41 రన్స్ తో క్రీజులో ఉన్నారు. అయితే ఈ టెస్టులో ఐర్లాండ్ ఇన్నింగ్సే హైలైట్ అని చెప్పాలి. ఆ టీమ్ గతంలో టెస్టుల్లో తమ అత్యధిక స్కోరు రికార్డును బ్రేక్ చేసింది. 1998లో పాకిస్థాన్ పై చేసిన 339 పరుగులకే ఇన్నాళ్లూ ఐర్లాండ్ అత్యధిక స్కోరుగా ఉంది. అయితే 25 ఏళ్ల తర్వాత ఆ రికార్డును బ్రేక్ చేసింది.

ఐర్లాండ్ బ్యాటర్లు పాల్ స్టిర్లింగ్ (103), కర్టిస్ కాంఫర్ (111) సెంచరీలతో చెలరేగడంతో 492 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇద్దరికీ టెస్టుల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. టెస్టుల్లో ఐర్లాండ్ తరఫున గతంలో కెవిన్ ఓబ్రైన్, లోర్కాన్ టక్కర్ సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్ లోనూ టక్కర్ 80 రన్స్ చేసి ఔటయ్యాడు. తొలి రోజు 74 పరుగుల దగ్గర కాళ్లు తిమ్మిర్లు రావడంతో రిటైర్డ్ ఔట్ అయిన స్టిర్లింగ్ రెండో రోజు మళ్లీ బరిలోకి దిగాడు.

అతడు అసిత ఫెర్నాండో బౌలింగ్ లో సిక్స్ ద్వారా టెస్టుల్లో తన తొలి సెంచరీ నమోదు చేయడం విశేషం. స్టిర్లింగ్ 181 బంతుల ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. సెంచరీ తర్వాత మరో సిక్స్ బాదడానికి ప్రయత్నించి 103 పరుగుల దగ్గర ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే కాంఫర్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం