తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rahul Dravid: ద్రవిడ్ చాలా స్లో.. టీ20లకు కోచ్‌గా పనికిరాడు: పాకిస్థాన్ మాజీ క్రికెటర్

Rahul Dravid: ద్రవిడ్ చాలా స్లో.. టీ20లకు కోచ్‌గా పనికిరాడు: పాకిస్థాన్ మాజీ క్రికెటర్

Hari Prasad S HT Telugu

10 August 2023, 16:18 IST

google News
    • Rahul Dravid: ద్రవిడ్ చాలా స్లో.. టీ20లకు కోచ్‌గా పనికిరాడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. ప్రస్తుతం వెస్టిండీస్ తో ఇండియా ఐదు టీ20ల సిరీస్ ఆడుతున్న వేళ కనేరియా ఈ కామెంట్స్ చేయడం విశేషం.
కెప్టెన్ రోహిత్ శర్మతో కోచ్ రాహుల్ ద్రవిడ్
కెప్టెన్ రోహిత్ శర్మతో కోచ్ రాహుల్ ద్రవిడ్ (AFP)

కెప్టెన్ రోహిత్ శర్మతో కోచ్ రాహుల్ ద్రవిడ్

Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అసలు టీ20 కోచింగ్ కు పనికి రాడని అంటున్నాడు పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా గెలవాలన్న పట్టుదలతో కనిపించడం లేదని అతడు స్పష్టం చేశాడు. హార్దిక్ ఐపీఎల్లో సక్సెస్ కావడానికి గుజరాత్ టైటన్స్ జట్టులో ఆశిష్ నెహ్రా ఉండటమే అని కనేరియా అనడం విశేషం.

ఈ సందర్బంగానే కోచ్ ద్రవిడ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అతడు చాలా స్లో అని విమర్శించాడు. "ఈ ఇండియన్ టీమ్ ఎందుకు గెలవాలన్న కసిని చూపించడం లేదు? గుజరాత్ టైట్సన్స్ తో హార్దిక్ చాలా సక్సెస్ సాధించాడు. ఎందుకంటే అక్క ఆశిష్ నెహ్రా ఉన్నాడు. టీ20ల్లో ఇండియా మరింత కసిగా ఆడాలి. అందులో కోచ్ పాత్ర కీలకం. రాహుల్ ద్రవిడ్ ఓ వరల్డ్ క్లాస్ ప్లేయరే.

కానీ టీ20ల్లో మాత్రం కోచ్ గా పనికి రాడు. అతడు చాలా స్లో. మరోవైపు ఆశిష్ నెహ్రాను చూడండి.. ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒకటి ఫీల్డ్ లోకి పంపిస్తూ ఉంటాడు. నాకు తెలిసి అతనికి ఓ అవకాశం ఇవ్వాలి" అని కనేరియా తన యూట్యూబ్ ఛానెల్లో అన్నాడు.

నిజానికి చాలా రోజులుగా కోచ్ ద్రవిడ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడు కోచ్ గా వచ్చిన తర్వాత టీమిండియాలో దూకుడు తగ్గిందని అభిమానులు విమర్శిస్తున్నారు. ఇక తాజా సిరీస్ లో వెస్టిండీస్ చేతుల్లో తొలి రెండు టీ20లు ఓడిన ఇండియన్ టీమ్.. మూడో టీ20లో గెలిచినా.. సిరీస్ కోల్పోయే ప్రమాదం ఇంకా ఉంది.

మిగిలిన రెండు మ్యాచ్ లు కూడా గెలిస్తేనే సిరీస్ సొంతమవుతుంది. ఈ రెండు మ్యాచ్ ల కోసం ఇండియా, వెస్టిండీస్ జట్లు అమెరికా వెళ్లాయి. అక్కడి ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామీలో మిగిలిన రెండు టీ20లు జరుగుతాయి. మూడో మ్యాచ్ లో సూర్యకుమార్ తిరిగి తన మెరుపు ఇన్నింగ్స్ ఆడటం.. తిలక్ వర్మ నిలకడతో ఇండియా గెలిచింది.

తదుపరి వ్యాసం