Parthiv Patel On Dravid : టీ20 కోచ్‌గా ద్రవిడ్ పనికిరాడు.. మాజీ క్రికెటర్ సెన్సేషనల్ కామెంట్స్
IND Vs WI T20 Series : భారత టీ20 క్రికెట్ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ సరికాదని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అన్నాడు. జట్టుకు సరైన మద్దతు ఇవ్వలేడని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్ తర్వాత భారత టీ20 జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ విషయంలో వెనక్కు వెళ్లారు. దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సిరీస్‌లో గుజరాత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు చేరాడు. అయితే తొలిసారి ఛాంపియన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
దీనిపై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. వెస్టిండీస్ తో టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా రెండు పెద్ద తప్పులు చేశాడని అన్నాడు. మొదటి T20I సమయంలో పవర్‌ప్లే ఓవర్‌లో బౌలింగ్ చేయమని హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్‌ను కోరాడని తెలిపాడు. అది కూడా నికోలస్ పూరన్ బ్యాటింగ్ చేస్తుండగా అక్షర్ పటేల్ కావడంతో ఎక్కువ పరుగులు వచ్చాయని తన అభిప్రాయం చెప్పాడు.
అదేవిధంగా రెండో టీ20 మ్యాచ్‌లో చాహల్ 4 ఓవర్లు ఇవ్వకుండానే వదిలేశాడని గుర్తు చేశాడు. 'గుజరాత్ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. అయితే అక్కడ అతనికి ఆసిస్ నెహ్రా మద్దతు ఉంది. కానీ రాహుల్ ద్రవిడ్ టీ20 క్రికెట్‌కు సరైన కోచ్ కాదు. టీ20 క్రికెట్‌కు కూడా నెహ్రా లాంటి డైనమిక్ కోచ్ అవసరం.' అని పార్థివ్ చెప్పుకొచ్చాడు.
హార్దిక్ పాండ్యా మంచి ఆటకాడని, అయితే అవసరమైన మద్దతు లభించలేదని పార్థివ్ పటేల్ చెప్పాడు. , రాహుల్ ద్రవిడ్ హార్దిక్ పాండ్యాకు అవసరమైన మద్దతు ఇవ్వడం లేదని పార్థివ్ పటేల్ అన్నాడు. టీ20 క్రికెట్ విషయానికొస్తే, కొన్ని క్షణాలు మాత్రమే ఆట గమనాన్ని మార్చగలవని, అందువల్ల టీ20 మ్యాచ్‌లో ప్రతి నిర్ణయం ముఖ్యమని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు ఆ నిర్ణయాలు తీసుకోవడానికి కెప్టెన్‌కు కోచ్ మద్దతు ఇవ్వాలని గుర్తు చేశాడు.
ఆగస్టు 8న భారత్, వెస్టిండీస్(IND Vs WI) మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్ జరిగిన గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ కూడా ఉంటుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన టీమ్‌ఇండియా(Team India) సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. డూ ఆర్ డై మ్యాచ్ ఇది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది.
నేటి మ్యాచ్‌కి టీమిండియాలో మార్పు వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌కు శుభారంభం లభించలేదు. పవర్ ప్లేలో భారత బ్యాటర్లు సత్తా చూపలేదు. శుభ్‌మన్ గిల్, జైస్వాల్‌కు అవకాశం రావొచ్చు. బ్యాటింగ్‌లో పెద్దగా ఆప్షన్ లేకపోవడంతో సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ తడబడినా ఆడాల్సిందే.