తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ashwin And Jadeja In Test Rankings: రెండో స్థానానికి అశ్విన్.. టాప్ 10లోకి జడేజా

Ashwin and Jadeja in test rankings: రెండో స్థానానికి అశ్విన్.. టాప్ 10లోకి జడేజా

Hari Prasad S HT Telugu

22 February 2023, 15:35 IST

google News
    • Ashwin and Jadeja in test rankings: రెండో స్థానానికి అశ్విన్.. మళ్లీ టాప్ 10లోకి జడేజా. ఐసీసీ బుధవారం (ఫిబ్రవరి 22) రిలీజ్ చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఇండియన్ ప్లేయర్స్ మళ్లీ మెరుగైన ర్యాంకులు సాధించారు.
జడేజా, అశ్విన్
జడేజా, అశ్విన్ (PTI)

జడేజా, అశ్విన్

Ashwin and Jadeja in test rankings: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా తొలి రెండు టెస్టులు గెలవడంలో కీలకపాత్ర పోషించిన స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ లో తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు. బౌలర్ల ర్యాంకుల్లో అశ్విన్ రెండో స్థానానికి ఎగబాకాడు.

మరోవైపు చాలా రోజులుగా టీమ్ కు దూరంగా ఉన్న జడేజా ఈ లేటెస్ట్ ర్యాంకుల్లో ఏడు స్థానాలు ఎగబాకి మళ్లీ టాప్ 10లోకి రావడం విశేషం. ముఖ్యంగా అతడు రెండో టెస్టులో 10 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. దీంతో తాజా ర్యాంకుల్లో 9వ స్థానానికి చేరుకున్నాడు. 2019, సెప్టెంబర్ తర్వాత జడేజా మళ్లీ టాప్ 10 లోకి రావడం ఇదే తొలిసారి.

ఇక గాయం కారణంగా ఐదారు నెలలుగా టీమ్ కు దూరంగా ఉంటున్న పేస్ బౌలర్ బుమ్రా కూడా టాప్ 10లోనే కొనసాగుతున్నాడు. తాజా ర్యాంకుల్లో అతడు ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక ఇన్నాళ్లూ టాప్ లో ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండు స్థానాలు దిగజారి మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇంగ్లండ్ సీమర్ జేమ్స్ ఆండర్సన్.. టాప్ లోకి దూసుకెళ్లాడు.

అటు తొలి రెండు టెస్టుల్లో బ్యాట్ తో రాణించిన అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ల లిస్టులో టాప్ 5లోకి వెళ్లాడు. ఈ లిస్ట్ లో జడేజా, అశ్విన్ టాప్ 2లో ఉన్నారు. బ్యాటర్ల లిస్టు చూస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లబుషేన్ టాప్ లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, బాబర్ ఆజం ఉన్నారు. ఇండియన్ బ్యాటర్లు రిషబ్ పంత్ 6, కెప్టెన్ రోహిత్ 7వ స్థానాల్లో కొనసాగుతున్నారు.

తదుపరి వ్యాసం