తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ashwin Record: కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్.. మరో అరుదైన క్లబ్‌లో చేరిన స్పిన్నర్

Ashwin Record: కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్.. మరో అరుదైన క్లబ్‌లో చేరిన స్పిన్నర్

Hari Prasad S HT Telugu

09 February 2023, 14:22 IST

google News
    • Ashwin Record: కుంబ్లే రికార్డు బ్రేక్ చేశాడు రవించంద్రన్ అశ్విన్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో తన తొలి వికెట్ తీయడం ద్వారా మరో అరుదైన క్లబ్‌లో అతడు చేరాడు.
అశ్విన్ అరుదైన ఘనత
అశ్విన్ అరుదైన ఘనత (AP)

అశ్విన్ అరుదైన ఘనత

Ashwin Record: టీమిండియా స్పిన్నర్ అశ్విన్ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 450 వికెట్లు మైలురాయిని అందుకున్నాడు. అయితే అత్యంత వేగంగా ఈ మైల్ స్టోన అందుకున్న ఇండియన్ స్పిన్నర్ గా నిలిచాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే రికార్డును అతడు బ్రేక్ చేశాడు. అశ్విన్ తన 89వ టెస్టులో ఈ ఘనత సాధించడం విశేషం.

ఇక టెస్టుల్లో ఈ ఘనత సాధించిన రెండో ఇండియన్ బౌలర్ కాగా.. ఓవరాల్ గా 9వ ప్లేయర్. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. టెస్టుల్లో అత్యంత వేగంగా 450 వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్ ది రెండోస్థానం. అతని కంటే ముందు ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. ఈ శ్రీలంక మాజీ స్పిన్నర్ తన 80వ టెస్టు మ్యాచ్ లోనే 450 వికెట్లు మైలురాయిని అందుకోవడం విశేషం. అంతేకాదు టెస్టుల్లో 3 వేల పరుగులు, 450 వికెట్లు తీసిన ఏకైక ఆసియా ప్లేయర్ కావడం మరో ఘనత.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆ టీమ్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీ వికెట్ తీయడం ద్వారా అశ్విన్ ఈ ఘనత సాధించాడు. నిజానికి తన తొలి 10 ఓవర్లలో అతనికి వికెట్ దక్కలేదు. 11వ ఓవర్లో కేరీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ పిచ్ తొలి రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలించడంతో జడేజాతో కలిసి అశ్విన్ చెలరేగాడు. దీంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది.

అంతకుముందు తొలి రోజు ఉదయమే ఇండియన్ పేసర్లు సిరాజ్, షమి ఆస్ట్రేలియాను దెబ్బ తీశారు. సిరాజ్ తాను వేసిన తొలి బంతికే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో షమి వేసిన బాల్.. వార్నర్ ఆఫ్ స్టంప్ ను లేపేసింది. దీంతో ఆసీస్ 2 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో స్మిత్, లబుషేన్ మూడో వికెట్ కు 82 పరుగులు జోడించి ఆదుకున్నారు.

తదుపరి వ్యాసం