తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Yogini Ekadashi 2024: రేపే యోగిని ఏకాదశి.. శుభ సమయం, పూజా విధానం, వ్రత నియమాలు, ప్రాముఖ్యత తెలుసుకోండి

Yogini ekadashi 2024: రేపే యోగిని ఏకాదశి.. శుభ సమయం, పూజా విధానం, వ్రత నియమాలు, ప్రాముఖ్యత తెలుసుకోండి

Gunti Soundarya HT Telugu

01 July 2024, 17:03 IST

google News
    • Yogini ekadashi 2024: జ్యేష్ఠ మాసంలో వచ్చే చివరి ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి శుభ సమయం, వ్రతం కోసం ఆచరించాల్సిన నియమాలు, పూజా విధానం, దీని ప్రాముఖ్యత వంటి విశేషాలు తెలుసుకుందాం. 
యోగిని ఏకాదశి శుభ సమయం
యోగిని ఏకాదశి శుభ సమయం

యోగిని ఏకాదశి శుభ సమయం

Yogini ekadashi 2024: ఈసారి 2024 యోగిని ఏకాదశి ఉపవాసం జూలై 2న వచ్చింది. ఈ సంవత్సరం యోగిని ఏకాదశి నాడు ఒక శుభ యాదృచ్చికం కారణంగా భక్తులు శ్రీమహావిష్ణువు ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూర్ణ క్రతువులతో పూజిస్తారు. 

విశ్వాసాల ప్రకారం యోగిని ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం వల్ల వ్యక్తి అన్ని కష్టాలు, దుఃఖాలు తొలగిపోతాయి. యోగిని ఏకాదశి శుభ సమయం, పూజా విధానం, మంత్రం, నైవేద్యం, పరిహారం, ఉపవాస సమయం, వ్రత నియమాల గురించి తెలుసుకుందాం. 

యోగిని ఏకాదశి ఎప్పుడు?

పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తేదీ జూలై 1 ఉదయం 10.26 గంటలకు ప్రారంభమై జూలై 2వ తేదీ మరుసటి రోజు ఉదయం 8.42 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయ తిథి కారణంగా జూలై 2వ తేదీ మంగళవారం యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. అనేక శుభ యోగాలతో యోగిని ఏకాదశి వచ్చింది. ఈరోజు త్రిపుష్కర యోగం, ధృతి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఉన్నాయి. 

యోగిని ఏకాదశి శుభ సమయం

యోగిని ఏకాదశి తిథి ప్రారంభం – జూలై 01, 2024 ఉదయం 10:26 గంటలకు

యోగిని ఏకాదశి తేదీ ముగుస్తుంది - జూలై 02, 2024 ఉదయం 08:42 గంటలకు

జూలై 3న, పరానా (ఉపవాస విరమణ) సమయం - ఉదయం 05:28 నుండి 07:10 వరకు

యోగిని ఏకాదశి పూజా విధానం

ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. తర్వాత ఇంట్లోనూ పూజగదిని శుభ్రం చేయండి. ఒక పీట వేసి దాని మీద వస్త్రం పరిచి శ్రీ హరి విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్టించాలి. అనంతరం జలాభిషేకం చేయండి. పంచామృతంతో పాటు గంగాజలంతో స్వామికి అభిషేకం చేసుకోవాలి. 

ఇప్పుడు పసుపు చందనం, పసుపు పుష్పాలను స్వామికి సమర్పించండి. స్వామి వారికి నెయ్యి దీపం వెలిగించండి. వీలైతే ఉపవాసం ఉండండి. యోగిని ఏకాదశి శీఘ్ర కథను చదవాలి. “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః” అనే మంత్రాన్ని జపించండి. భగవంతుడు శ్రీ హరి విష్ణు, లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. భగవంతునికి తులసిని సమర్పించండి. చివర్లో క్షమాపణ చెప్పండి. బెల్లం, పప్పు, ఎండుద్రాక్ష, అరటిపండు వంటివి నైవేద్యంగా సమర్పించాలి. యోగిని ఏకాదశి రోజు చేసే దానానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు అన్నదానం చేస్తే 88 వేల మంది బ్రహ్మణులకు దానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. 

మంత్రం- ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం విష్ణవే నమః:

పరిహారం- యోగిని ఏకాదశి రోజున శ్రీ విష్ణు చాలీసా పఠించడం, అరటి చెట్టును పూజించడం ద్వారా వ్యక్తి అన్ని కోరికలు నెరవేరుతాయి.

యోగిని ఏకాదశి రోజు చేయకూడని పనులు 

నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. వాటికి బదులుగా పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా శుభదాయకం. తులసి సమర్పించకుండా విష్ణు పూజ పూర్తి కాదు. అందుకే యోగిని ఏకాదశి రోజు తులసి తప్పనిసరిగా సమర్పిస్తారు. కానీ ఏకాదశి రోజు తులసి ఆకులు తెంప కూడదు. అలాగే అన్నం తినకూడదు. ఇలా చేస్తే అపరాధ భావం కలుగుతుందని నమ్ముతారు. 

పెద్దవారికి ఎవరిని నొప్పించకూడదు. ఎవరినీ కించపరచొద్దు. యోగిని ఏకాదశి రోజు ఆల్కహాల్ సేవించరాదు. తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. 

 

ye

తదుపరి వ్యాసం