Yogini ekadashi 2024: యోగిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి?-yogini ekadashi 2024 date time significance puja vidhanam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Yogini Ekadashi 2024: యోగిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి?

Yogini ekadashi 2024: యోగిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి?

Gunti Soundarya HT Telugu
Published Jun 27, 2024 04:32 PM IST

Yogini ekadashi 2024: జ్యేష్ఠ మాసంలో వచ్చే చివరి ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? దీని ప్రాముఖ్యత ఏంటి? ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సకల యోగాలు లభిస్తాయి.

యోగిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది?
యోగిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది? (pixahive)

Yogini ekadashi 2024: జ్యేష్ఠ మాసంలో వచ్చే చివరి ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశి తిథి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఈ రోజున శ్రీమహావిష్ణువును ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా కోరిన కోర్కెలు నెరవేరుతాయి.

హిందూ మతంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి తిథి ప్రతి నెల రెండుసార్లు వస్తుంది. కృష్ణ పక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి. ఒక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది. యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి విష్ణువును పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. ఈ ఏడాది యోగిని ఏకాదశి జులై 2వ తేదీ వచ్చింది. దేవశయని ఏకాదశికి ముందు ఈ యోగిని ఏకాదశి వస్తుంది.

దేవశయని ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళతారు. యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించిన వ్యక్తికి 88 వేళ మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. మరణించిన తర్వాత ఆత్మకు మోక్షం లభించి వైకుంఠ ప్రవేశం పొందుతారు.

యోగిని ఏకాదశి శుభ ముహూర్తం

పంచాంగం ప్రకారం యోగిని ఏకాదశి తిథి జులై 1, 2024 ఉదయం 10.26 నుంచి ప్రారంభమవుతుంది

యోగిని ఏకాదశి తిథి ముగింపు జులై 2 ఉదయం 8.42 గంటలకు.

ఉదయ తిథి ప్రకారం యోగిని ఏకాదశి జులై 2 జరుపుకోనున్నారు.

రెండు శుభ యోగాలు

యోగిని ఏకాదశి ఉపవాసం రోజు రెండు శుభ యోగాలు ఉన్నాయి. త్రిపుష్కర యోగం, సర్వార్థ సిద్ధి యోగం వచ్చాయి. సర్వార్థ సిద్ధి యోగం జులై 2 ఉదయం 5.27 నుంచి జులై 3 ఉదయం 4.40 వరకు ఉంటుంది. త్రిపుష్కర యోగం జులై 2 ఉదయం 8.42 నుంచి ప్రారంభమై మరుసటి రోజు జులై 3 ఉదయం 4.40 వరకు ఉంది.

యోగిని ఏకాదశి ప్రాముఖ్యత

యోగిని ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణుడిని పూజిస్తారు. పద్మ పురాణం ప్రకారం యోగిని ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. యోగిని ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణు నామ స్మరణ చేయాలి. ఇలా చేయడం వల్ల సంపద, సంతోషం, శ్రేయస్సు పొందుతారు. ఈ యోగిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. యోగిని ఏకాదశి గురించి స్వయంగా శ్రీకృష్ణుడు యుధిష్టిరుడికి చెప్పినట్టుగా బ్రహ్మ పురాణం చెబుతోంది.

పూజా విధానం

యోగిని ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. గంగాజలంతో అభిషేకించాలి. తులసి ఆకులతో స్వామిని పూజించడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు త్వరగా లభిస్తాయి. ఏకాదశి రోజు అనారోగ్య బాధితులకు పండ్లు, దుప్పట్లు దానం చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Whats_app_banner