Aloe vera vastu tips: వాస్తు ప్రకారం కలబంద ఈ దిశలో నాటారంటే మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది
22 February 2024, 14:15 IST
- Aloe vera vastu tips: కలబంద ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎక్కువగా వినియోగిస్తారు. కానీ ఇది వాస్తు శాస్త్రంలో కూడా అనేక ప్రయోజనాలు కలిగించే మొక్కగా పేరు పొందింది. అందుకే దీన్ని అదృష్ట మొక్క అంటారు.
వాస్తు ప్రకారం కలబంద ఏ దిశలో నాటాలి?
Aloe vera vastu tips: కలబంద అందం, ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో ముందు ఉంటుంది. కలబంద పేరు చెప్పగానే అందరూ ఆరోగ్య ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కూడా కలబందకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ మొక్క ఇంట్లో సంపద, శ్రేయస్సుకి లోటు ఉండదని చెప్తారు. చాలా మంది తమ ఇళ్ళలో అలోవెరా పెంచుకుంటారు. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్, జేడ్ మొక్క మాదిరిగా ఇది కూడా అదృష్టాన్ని ఇచ్చే మొక్క. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్క కలబంద. అందుకే ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలా ప్రయోజనాలు అందిస్తుంది.
వాస్తు ప్రకారం కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకుంటే చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ మొక్కను నాటేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కలబంద మొక్క సరైన దిశలో నాటడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం ఎప్పుడు మీమీద ఉంటుంది. సంపద పెరుగుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే కుటుంబం మొత్తం శ్రేయస్సుతో నిండిపోతుంది. వారి కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.
కలబందను ఏ దిశలో నాటాలి?
ఇంట్లో కలబంద మొక్కను నాటేటప్పుడు దిశపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి ఆశీస్సులు పొందగలుగుతారు. దీని కోసం కలబంద మొక్కను ఎప్పుడూ తూర్పు దిశలో నాటాలి. ఈ దిశలో కలబంద మొక్క ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో పెంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.
జీవితంలో పురోగతి, సంతోషం, శ్రేయస్సుని కోరుకుంటే పశ్చిమ దిశలో కలబంద మొక్క నాటవచ్చు. ఈ మొక్క పెట్టడం కోసం పశ్చిమ దిశ అత్యంత శుభప్రదమైనదిగా నిపుణులు చెబుతున్నారు. ఇది జీవితంలో విజయం, పురోగతికి అనేక అవకాశాలు అందిస్తుందని నమ్ముతారు. అలాగే కలబంద మొక్కను ఆగ్నేయ మూలలో పెట్టడం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. పడమర దిశలో పెడితే ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు.
పాజిటివ్ ఎనర్జీ కోసం..
సరైన దిశలో కలబంద మొక్క పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీరు ఆర్థిక సమస్యలు, దుష్ట శక్తుల వల్ల ఇబ్బందులు పడుతున్నట్టయితే కలబంద మొక్కని ఇంట్లో సరైన దిశలో పెట్టుకోండి. ఇంట్లో పెంచుకోగలిగే సులభమైన ఉత్తమమైన మొక్కలలో ఇది ఒకటి.
ఇంటి బాల్కనీలో పెట్టుకుంటే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. కలబంద మొక్క చాలా సులభంగా పెరుగుతుంది. ఒకటి నాటితే అనేక పిలకలు వస్తాయి. కుండీ మొత్తం విస్తరిస్తుంది. అందుకే ఒక మొక్క మాత్రమే కుండీలో ఉండేలా చూసుకోవాలి. ఇది ఇంట్లో ఉంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు బెడ్ రూమ్ లో కలబంద మొక్క పెట్టుకోవచ్చు.
ఈ దిశలో అసలు పెట్టొద్దు
వాయువ్య దిశలో పెడితే అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. వాస్తు ప్రకారం ఈ దిశ ఆర్థిక సమస్యలు కలిగిస్తుంది. కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అశుభ ఫలితాలు ఇస్తుంది.