Rat remove tips: ఎలుకల బెడద ఎక్కువగా ఉందా? అయితే ఈ మొక్కలు మీ ఇంట్లో పెంచుకోండి-just plant these 5 plants at home to repel rats readmore details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rat Remove Tips: ఎలుకల బెడద ఎక్కువగా ఉందా? అయితే ఈ మొక్కలు మీ ఇంట్లో పెంచుకోండి

Rat remove tips: ఎలుకల బెడద ఎక్కువగా ఉందా? అయితే ఈ మొక్కలు మీ ఇంట్లో పెంచుకోండి

Feb 20, 2024, 04:27 PM IST Gunti Soundarya
Feb 20, 2024, 04:27 PM , IST

  • ఎలుకల ఇంట్లో సంచరిస్తూ విసుగుపుట్టిస్తాయి. ప్రత్యేకించి మీ ఇంట్లో కారు లేదా బైక్ ఉంటే వాటి వైర్లను కొరుకుతూ మన జేబులు చిల్లులు పడేలా చేస్తాయి. వాటిని తరిమికొట్టాలంటే ఈ మొక్కలు పెంచుకోండి. 

ఇంట్లో ఎలుకలను వదిలించుకోవడానికి మీరు ఎలుకల మందు, బోనులు పెట్టి విసిగిపోయారా? అయితే ఈరోజే మీ పెరట్లో ఈ 5 మొక్కలను నాటండి. ఈ మొక్కలు మీ పెరటి అందాన్ని పెంచడమే కాకుండా ఇంటిని, వస్తువులను ఎలుకల వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి.

(1 / 6)

వెల్లుల్లి మొక్క- వెల్లుల్లి వంటకి మంచి రుచి ఇవ్వడమే కాదు ఎలుకల బారినుంచి మీ కిచెన్ ని కాపాడుతుంది. వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాల కారణంగా దీని ఘాటైన వాసన ఎలుకలు పారిపోయేలా చేస్తుంది. 

(2 / 6)

లావెండర్ మొక్క- అందమైన ఊదారంగు లావెండర్ మొక్క దాని మంచి సువాసను ఇవ్వడం మాత్రమే కాదు ఎలుకలను ఇంటి నుండి దూరంగా ఉంచడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో లావెండర్ మొక్క కాండం ఉంచవచ్చు.

(3 / 6)

పుదీనా మొక్క- పుదీనా వాసనకు ఎలుకలు పారిపోతాయి. ఒక కుండలో పుదీనా పెంచుకోండి. మీ ఇంట్లోకి ఎలుకలు రావు. పుదీనా ఆకులు వేసి నూనె కాచి అందులో దూదిని ముంచి ఎలుకలు వచ్చే ప్రదేశంలో రాయండి. వాసన పోయిన ప్రతిసారి మళ్ళీ రాయండి ఎలుకలు దరిదాపుల్లో కనిపించవు. 

(4 / 6)

లెమన్‌గ్రాస్ లేదా సిట్రోనెల్లా మొక్క గడ్డిలా కనిపిస్తుంది. ఈ మొక్క దాని సువాసనకు ప్రసిద్ధి చెందింది. ఎలుకలు ఈ వాసన ఉన్న చుట్టుపక్కల కూడా ఉండవు. ఎలుకల నుండి మాత్రమే కాకుండా కీటకాల నుండి ఇంటిని రక్షించడానికి లెమన్ గ్రాస్ ఇంట్లో పెంచుకోండి. 

(5 / 6)

ఉల్లిపాయ మొక్క- ఉల్లిపాయ ఆహారానికి రుచి ఇస్తుంది. అలాగే మీ ఎలుక సమస్యను కూడా తొలగిస్తుంది. తరిగిన ఉల్లిపాయల ఘాటైన వాసన ఎలుకల కళ్ళను చికాకుపెడుతుంది, దీని కారణంగా అవి ఇంటికి దూరంగా ఉంటాయి. ఒక ఎలుక పచ్చి ఉల్లిపాయను మింగితే, అది రక్తహీనత లక్షణాలను కలిగిస్తుంది. వాటి కణాలకు ఆక్సిజన్ కూడా అందదు. అందుకే ఇంటి చుట్టూ ఉల్లిపాయ ముక్కలు పెట్టండి ఎలుకలు ఇంట్లోకి రావాలంటేనే భయపడతాయి. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు