Bedroom vastu tips: పడకగది ఏ దిశలో ఉంటే మంచిది? ఎటువంటి వస్తువులు బెడ్ రూమ్ లో ఉండకూడదు
Bedroom vastu tips: బెడ్ రూమ్ లోనే మనం ఎక్కువ సమయం గడిపేది. అందుకే జీవితం బాగుండాలంటే బెడ్ రూమ్ వాస్తు ప్రకారం ఉండాలి. ఏ దిక్కున బెడ్ రూమ్ ఉంటే మేలు జరుగుతుందో తెలుసా?
Bedroom vastu tips: ప్రశాంతమైన జీవితం, మంచి నిద్ర పొందాలంటే పడక గది వాస్తు సరిగా ఉండాలి. పురాతన వాస్తు శాస్త్రం ప్రకారం పడక గది విశ్వ శక్తిని ఉపయోగిస్తుందని అంటారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంతోషాన్ని నింపుతుంది. అందుకే బెడ్ రూమ్ వాస్తు సరిగా ఉండాలి. సరైన దిశలోనే పడక గది నిర్మించుకోవాలి. అప్పుడే జీవితం సజావుగా ఉంటుంది.
పడకగది ఏ దిశలో ఉండాలి?
ఇంట్లో ఉండే అతి ముఖ్యమైన వ్యక్తిగత ప్రదేశాలలో బెడ్ రూమ్ ఒకటి. అటువంటి పడక గది దిశ కరెక్ట్ గా ఉన్నప్పుడే ఎటువంటి గొడవలు లేకుండా దాంపత్య జీవితం బాగుంటుంది. వాస్తు ప్రకారం పడక గది ఇంటి నైరుతి మూల ఉండాలి. అతిథి, పిల్లల పడక గదులు వాయువ్య మూలలో ఉండాలి. వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తరం వైపు గోడలకు కిటికీలు ఉండేలా చూసుకోవాలి.
ఇక పడుకునేటప్పుడు తల దక్షిణం వైపు, పాదాలు ఉత్తరం వైపు ఉండాలి. ఇంట్లో మాస్టర్ బెడ్ రూమ్ వాస్తు ప్రకారం ఉండాలి. ఇది నిద్ర నాణ్యత, కుటుంబ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మాస్టర్ బెడ్ రూమ్ లో బెడ్ మీద నిద్రించే స్థానం దక్షిణం లేదా పడమర. కాళ్ళు పడకగది తలుపుల వైపుకు పెడితే పీడకలలు కలిగిస్తుంది.
ఆగ్నేయ దిశలో మాస్టర్ బెడ్ రూమ్ ఉంటే గొడవలు, అపార్థాలు ఏర్పడతాయి. ఉత్తరం వైపు తిరిగి పడుకుంటే ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. రక్తపోటు పెరిగే అవకాశం ఉందని అంటారు. వాస్తు ప్రకారం మాస్టర్ బెడ్ రూమ్ లో బెడ్ దక్షిణ ప్రాంతం లేదా నైరుతిలో ఉండాలి. రెండింటి మధ్య వేస్తే భార్యాభర్త బంధంలో సమస్యలు తలెత్తుతాయి. మంచం చుట్టూ కూడా కాస్త అయినా ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. కొంతమంది గోడలకు మంచం ఆనుకునేలా వేస్తారు. అది మంచిది కాదు.
బెడ్ రూమ్ లో ఇవి ఉండకూడదు
పడకగదిలో బెడ్ కి ఎదురుగా అద్దం ఉండకూడదు. నిద్రిస్తున్న వ్యక్తి ప్రతిబింబం కనిపించడం అశుభంగా పరిగణిస్తారు. ఉత్తర లేదా తూర్పు వైపు గోడలకు అద్దాలు పెట్టుకోవడం ఉత్తమైనది. టీవీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు గదిలో పెట్టుకోకపోవడమే మంచిది. ఇవి నిద్రకు భంగం కలిగించే శక్తిని పంపుతాయి. వార్డ్ రోబ్, కబోర్డ్ తలుపుల మీద అద్దాలు పెట్టకూడదు. ఇవి ప్రతికూల శక్తులని ఆకరిస్తాయి. డ్రెస్సింగ్ టేబుల్ మంచం పక్కన పెట్టుకుంటే మంచిది.
ధనం నిలవాలంటే
పడకగది వాస్తు ప్రకారం లాకర్ పెట్టుకోవాలని అనుకుంటే దక్షిణం వైపు పెట్టుకోవాలి. సేఫ్ ని తెరిచినప్పుడు అది ఉత్తర ముఖంగా తెరుచుకునేలా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దక్షిణం వైపు సంపాదలకు అధిపతి కుబేరుడు ఉంటాడు. ఆ దిశలో లాకర్ పెట్టుకుంటే మీ సంపద కూడా నిలుస్తుంది.
మొక్కలు ఉంటే మేలు
ఇంట్లో మొక్కలు ఉంటే ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. తాజా పువ్వులు, పూల కుండీలు చూస్తే మనసుకి హాయిగా ఉంటుంది. కృత్రిమ పువ్వులు, ముళ్ళ మొక్కలు గదిలో నివారించాలి. మనీ ప్లాంట్ పడకగదికి అందాన్ని తీసుకొస్తాయి. మొక్కలు పెట్టుకోవడం వల్ల ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడతాయి. సానుకూల శక్తిని కలిగి ఉంటాయి.
ఉత్తమ రంగు ఎంచుకోవాలి
బెడ్ రూమ్ గోడలకు ముదురు రంగులు వేయడం వల్ల మనసు గందరగోళంగా మారుతుంది. లేత రంగులు వేసుకోవాలి. వాస్తు ప్రకారం తెలుపు, లేత ఆకుపచ్చరంగు వేసుకోవచ్చు. పసుపు రంగు వేసుకుంటే మంచిది. ఆకుపచ్చ ఆరోగ్యాన్ని అందిస్తుంది. పసుపు రంగు ఆనందం, సానుకూలత, తెలివితేటలకి ప్రతీకగా నిలుస్తుంది. అన్నింటికంటే తెలుపు రంగు అందంగా ఉంటుంది. స్వేచ్చ, స్వచ్చట, శాంతికికి ప్రతీకగా తెలుపు నిలుస్తుంది.
ఈ నియమాలు పాటించాలి
పడకగది తలుపు 90 డిగ్రీల కోణంలో తెరవాలి. నిద్రలేవగానే కళ్లకి, మనసుకుని నచ్చినవి చూస్తే రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల ఫోటోలు లేదంటే పువ్వులు చూడటం మంచిది. అలాగే మంచం బాత్ రూమ్ కి అడ్డంగా ఉండకూడదు. ఎప్పుడూ బాత్ రూమ్ తలుపు మూసేసి ఉండాలి.
టాపిక్