తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Navaratri: 2024 లో నవరాత్రులు ఎప్పుడు నిర్వహించుకోవాలి?

Navaratri: 2024 లో నవరాత్రులు ఎప్పుడు నిర్వహించుకోవాలి?

Gunti Soundarya HT Telugu

19 December 2023, 18:43 IST

google News
    • Navaratrulu: 2024లో నవరాత్రులు రెండు సార్లు జరుపుకుంటారు. ఏయే తేదీల్లో నవరాత్రులు వచ్చాయంటే.. 
దుర్గామాత
దుర్గామాత (pixabay)

దుర్గామాత

Navaratrulu: సనాతన ధర్మంలో దుర్గామాతకి అంకితం చేయబడిన నవరాత్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవరాత్రులని సంవత్సరానికి రెండు సార్లు జరుపుకుంటారు. సంవత్సరంలో వచ్చే మొదటి నవరాత్రులని చైత్ర నవరాత్రులు అంటారు. 

లేటెస్ట్ ఫోటోలు

ఇప్పుడు స్మార్ట్​ఫోన్స్​కి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు- రూ. 15వేల బడ్జెట్​లో ఇవి ది బెస్ట్​!

Dec 22, 2024, 09:00 AM

TG Indiramma Housing Scheme Updates : ప్రతి మండలంలో 'ఇందిరమ్మ మోడల్ హౌజ్' నిర్మాణం..! అర్హుల జాబితా ఎప్పుడంటే..?

Dec 22, 2024, 08:27 AM

CM Ravanth Reddy : ఇతర మతాలను కించపరిచే చర్యలను ప్రభుత్వం సహించదు- సీఎం రేవంత్ రెడ్డి

Dec 21, 2024, 11:48 PM

No expiry date foods: ఈ ఆహార పదార్ధాలకు ఎక్స్పైరీ డేట్ లేదు.. తెలుసా..?

Dec 21, 2024, 10:18 PM

Bajaj Chetak EV: సరికొత్త అవతారంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్

Dec 21, 2024, 09:50 PM

Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్‌గా వెంక‌టేష్ - సంక్రాంతి సంద‌డి ముందుగానే!

Dec 21, 2024, 07:46 PM

రెండో సారి వచ్చే నవరాత్రులని శార్దియ నవరాత్రులు అంటారు. మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. 2024 లో నవరాత్రులు ఎప్పుడు వస్తాయి, ఏ రోజున అమ్మవారిని పూజించాలో తెలుసుకుందాం. 

చైత్ర నవరాత్రులు 

ఏడాదిలో తొలిసారిగా వచ్చే నవరాత్రులు చైత్ర నవరాత్రులు. తొమ్మిది రోజుల పాటు దుర్గామాతని పూజిస్తారు. 

ఏప్రిల్ 9, మెదటి తిథి- శైలపుత్రి దేవి ఆరాధన 

ఏప్రిల్ 10, రెండవ తిథి- బ్రహ్మచారిణి దేవి ఆరాధన 

ఏప్రిల్ 11, తృతీయ తిథి- చంద్రఘంటా దేవి ఆరాధన 

ఏప్రిల్ 12, చతుర్థి తిథి- కూష్మాండ దేవి ఆరాధన 

ఏప్రిల్ 13, పంచమి తిథి- స్కందమాత ఆరాధన 

ఏప్రిల్ 14, షష్ఠి తిథి- కాత్యాయని దేవి ఆరాధన 

ఏప్రిల్ 15, సప్తమి తిథి- మా కాళరాత్రి దేవి ఆరాధన 

ఏప్రిల్ 16, అష్టమి తిథి- మాత మహాగౌరీ ఆరాధన 

ఏప్రిల్ 17, నవమి తిథి- మాత సిద్ధిధాత్రీ దేవి ఆరాధన 

చైత్ర ఘటస్థాపన శుభ సమయం

ఘట స్థాపన ముహూర్తం- ఏప్రిల్ 9, మంగళవారం ఉదయం 6.02 గంటల నుంచి 10.16 వరకు  

వ్యవధి- 4 గంటల 14 నిమిషాలు 

ఘటస్థాపన అభిజిత్ ముహూర్తం- 11.57 నుంచి మధ్యాహ్నం 12.48 వరకు 

వ్యవధి- 51 నిమిషాలు 

శార్దీయ నవరాత్రులు ఎప్పుడు?

అక్టోబర్ 3, మొదటి తిథి- తల్లి శైలపుత్రి ఆరాధన 

అక్టోబర్ 4, రెండో తిథి- బ్రహ్మచారిణి దేవి ఆరాధన 

అక్టోబర్ 5, తృతీయ తిథి- చంద్రఘంటా దేవి ఆరాధన 

అక్టోబర్ 6, చతుర్థి తిథి- కూష్మాండ దేవి ఆరాధన 

అక్టోబర్ 7, పంచమి తిథి- స్కందమాత ఆరాధన 

అక్టోబర్ 8, షష్ఠి తిథి- కాత్యాయని దేవి ఆరాధన 

అక్టోబర్ 9, సప్తమి తిథి- మా కాళరాత్రి దేవి ఆరాధన 

అక్టోబర్ 10, అష్టమి తిథి- మాత మహాగౌరీ ఆరాధన

అక్టోబర్ 11, నవాటి తిథి- మాత సిద్ధిధాత్రీ దేవి ఆరాధన

ఘట స్థాపన శుభ సమయం 

ఘటస్థాపన ముహూర్తం- అక్టోబర్ 3, 2024 గురువారం ఉదయం 6.15 నుంచి 7.22 వరకు 

వ్యవధి- 1 గంట 6 నిమిషాలు 

ఘట స్థాపన అభిజిత్ ముహూర్తం- 11.46 నుంచి 12.33 వరకు 

వ్యవధి- 47 నిమిషాలు 

 

తదుపరి వ్యాసం