Solar Eclipse: ఈ ఏడాది రెండో సూర్య గ్రహణం ఎప్పుడు వచ్చింది? రింగ్ ఆఫ్ ఫైర్ అని ఎందుకు అంటారు?
20 June 2024, 14:29 IST
- Solar Eclipse: ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది? ఈ గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని ఎందుకు పిలుస్తారు? భారత్ లో కనిపిస్తుందా లేదా అనే విషయాలు తెలుసుకోండి.
ఈ ఏడాది సూర్య గ్రహణం ఎప్పుడు వచ్చింది?
Solar Eclipse: 2024లో రెండు సూర్యగ్రహణాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్‌లో ఏర్పడనుంది. ఈ రోజు హిందూ క్యాలెండర్‌లో అమావాస్య రోజు అక్టోబర్ 2న సూర్యగ్రహణం వచ్చింది. సాధారణంగా సూర్య గ్రహణం మూడు రకాలుగా ఉంటుంది. పాక్షిక సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్య గ్రహణం, వార్షిక సూర్య గ్రహణం.
రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి?
చంద్రుడి నీడ సూర్యుడిలోని కొంత భాగాన్ని కప్పి ఉంచితే అప్పుడు పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడి కొంత భాగమే కనిపిస్తుంది. మిగతా భాగం నల్లగా ఉంటుంది. ఇక సంపూర్ణ సూర్య గ్రహణం అంటే సూర్యుడిని మొత్తం చంద్రుడు కప్పేస్తాడు. ఈ సమయంలో భూమి మీద చీకటిగా ఉంటుంది.
ఈ ఏడాది వచ్చిన మొదటి సూర్యగ్రహణం ఇదే. ఇక చివరిది వార్షిక సూర్య గ్రహణం. చంద్రుడు, సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది. కానీ భూమి నుంచి దూరంగా ఉండటం వల్ల సూర్యుడి చుట్టూ ఒక వృత్తాకార వలయం ఏర్పడుతుంది. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అంటే ఒక అగ్ని వలయం ఆకారంలో కనిపిస్తుంది.
ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం 8 ఏప్రిల్ 2024న సంభవించింది. ఈ సూర్యగ్రహణం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే ఇది సంపూర్ణ గ్రహణం. పగటి వేళ కొన్ని నిమిషాల పాటు భూమిపై పూర్తిగా చీకటి అలుముకుంది. భారత కాలమానం ప్రకారం ఈ ఏడాదిలో వచ్చే రెండో సూర్యగ్రహణం రాత్రి 9:13 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 3:17 గంటలకు ముగుస్తుంది. అంటే ఈ వార్షిక సూర్యగ్రహణం దాదాపు 6 గంటల 4 నిమిషాల పాటు కొనసాగనుంది.
ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం ఎందుకు ప్రత్యేకం?
హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో ఈ రెండవ సూర్యగ్రహణం వృత్తాకారంగా ఉంటుందని జ్యోతిష్యులు వెల్లడించారు. అందుకే దీన్ని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని కూడా పిలుస్తారు.
సూతక్ కాలం ఉంటుందా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతక్ కాలం ప్రారంభమవుతుంది. ఇది గ్రహణం ముగిసే వరకు ఉంటుంది. మొదటి సూర్యగ్రహణం మాదిరిగానే రెండో సూర్యగ్రహణం సమయంలో కూడా సూతక్ కాలం చెల్లదు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం భారత్ లో కనిపించదు. సూతక్ కాలంలో భగవంతుడిని పూజించకూడదు, తాకకూడదు. ఈ సమయంలో కొన్ని పనులు చేయడం కూడా నిషేధంగా చెప్తారు.
సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
ఈ ఏడాది ఏర్పడబోయే రెండో సూర్యగ్రహణం భారత్ లో కనిపించదు. ఆర్కిటిక్, పెరూ, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అర్జెంటీనా, ఫిజీ తదితర దేశాల్లో ఈ ఏడాది రెండో సూర్య గ్రహణం కనిపించనుంది. ఈ దేశాల్లో సూతక్ కాలం 12 గంటల ముందు నుంచి ప్రారంభమవుతుంది.
సూర్యగ్రహణం సమయంలో ఏమి చేయకూడదు?
గ్రహణం కనిపించే ప్రదేశాలలో సూతక్ కాలం 12 గంటల ముందు నుంచే ప్రారంభం కావడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సూతక్ కాలంలో వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు మినహా ఆహారం మొదలైన వాటిని తినడం మానుకోండి. అలాగే ఆహార పదార్థాలలో తులసి ఆకులు, దర్భ గడ్డి వంటి వాటిని పెట్టుకోవాలి. గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు పండ్లు, కూరగాయలు మొదలైన వాటిని కత్తిరించడం, పదునైన వస్తువులను ఉపయోగించడం మానుకోవాలి. గ్రహణ సమయంలో దేవుడిని పూజించడం లేదా తాకడం చేయరాదు. గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణం సమయంలో గ్రహణాన్ని చూడకూడదు, బయటకు వెళ్లకూడదు.
టాపిక్