తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mokshada Ekadashi: మోక్షద ఏకాదశి రోజు భగవద్గీత పఠిస్తే వంశపారపర్య దోషాల నుంచి విముక్తి

Mokshada ekadashi: మోక్షద ఏకాదశి రోజు భగవద్గీత పఠిస్తే వంశపారపర్య దోషాల నుంచి విముక్తి

Gunti Soundarya HT Telugu

21 December 2023, 13:00 IST

google News
    • Mokshada ekadashi: మోక్షద ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజునే గీతా జయంతి జరుపుకుంటారు.  
మోక్షద ఏకాదశి విశిష్టత
మోక్షద ఏకాదశి విశిష్టత (pixahive)

మోక్షద ఏకాదశి విశిష్టత

Mokshada ekadashi: హిందూ పంచాగం ప్రకారం వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉంది విష్ణువుని పూజిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే దీన్ని మోక్షద ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది మరొక సారి ముక్కోటి ఏకాదశి వచ్చించి. జనవరి 1, 2 తేదీల్లో ఒకసారి ముక్కోటి ఏకాదశి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2023 చివరి నెల డిసెంబర్ 22, 23 తేదీల్లో వైకుంఠ ఏకాదశి వచ్చింది.

గీత పఠిస్తే సర్వపాపాల నుంచి విముక్తి

మోక్షద ఏకాదశి నాడు భగవద్గీతని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. అలా ఈరోజును గీతా జయంతిగా కూడా జరుపుకుంటారు. మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశి నాడు గీతా జయంతి జరుపుతారు. మోక్షద ఏకాదశికి, గీతాజయంతికి ఉన్న సంబంధం పురాణాల్లో కనిపిస్తుంది. యుద్ధ భూమిలో తన ప్రియమైన వారిని చూసి అర్జునుడు చలించిపోతాడు. తన దృష్టి మరల్చడం కోసం శ్రీకృష్ణుడు అతనికి గీతను బోధించాడు. పూర్తి శక్తితో యుద్ధం చేయమని కోరతాడు. అప్పుడు అర్జునుడు కౌరవులని ఓడించి యుద్దంలో విజయం సాధిస్తాడు.

మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గీత బోధిస్తుంది. మోక్షద ఏకాదశి నాడు గీతను పూజించడం మంచిది. ఆరోజు శ్రీవిష్ణువు, కృష్ణుడిని పూజిస్తారు. మోక్షద ఏకాదశి నాడు భగవద్గీత పఠించడం వల్ల పితృ దోషం నుంచి విముక్తి లభిస్తుంది. ఈరోజు విష్ణు మూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మోక్షం లభిస్తుంది. మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. పూర్వీకులు కూడా మోక్షం పొందుతారు. ఉపవాసం ఉండి ఉత్తర ద్వార దర్శనం నుంచి విష్ణుమూర్తిని దర్శించుకుంటే వైకుంఠంలో ప్రవేశిస్తారని భక్తుల విశ్వాసం.

ఏకాదశి తిథి ఎప్పుడంటే..

డిసెంబర్ 22 ఉదయం 9 గంటల 39 నిమిషాల వరకు దశమి ఉంది. ఆ తర్వాత నుంచి ఏకాదశి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 23 ఉదయం 7 గంటల 56 నిమిషాల వరకు ఏకాదశి ఉంటుంది.

వైకుంఠ ఏకాదశి విశిష్టత

ఏటా 24 ఏకాదశులు వస్తాయి. కానీ వైకుంఠ ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది. విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. ఉత్తరాయణానికి ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజు విష్ణువు ఆలయాల్లో ఉత్తర ద్వార మార్గం గుండా మహా విష్ణువుని దర్శించుకునేందుకు భక్తులు ఎదురుచూస్తారు.

మహా విష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే ముక్కోటి ఏకాదశి అంటారు. రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి విష్ణువుని దర్శించుకుని తమ బాధలు విన్నవించుకున్నారు. వారి విన్నపాన్ని స్వీకరించిన మహావిష్ణువు రాక్షసుడి పీడ వదిలించాడు. అప్పుడే హాలాహలం, అమృతం రెండు పుట్టాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనకి ఉన్న కష్టాలు, పీడలు కూడా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ముక్తి పొందాలంటే ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలని చెబుతుంటారు.

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం

మోక్షద ఏకాదశి రోజు కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడం వల్ల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. తెల్ల ఏనుగు విగ్రహం, కామధేనువు ఆవు విగ్రహం, చేప ప్రతిమని ఇంటికి తీసుకొచ్చుకుంటే మంచిది. ఇవి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూస్తాయి. ఆ ఇంటి మీద లక్ష్మీదేవి కూడా అనుగ్రహం ఉంటుంది.

తదుపరి వ్యాసం