Vaikuntha Ekadashi 2023: ఈరోజు వైకుంఠ ఏకాదశి.. హిందూ పురాణాల ప్రకారం ఈరోజు ఎంతో ప్రాముఖ్యతను కలిగిన ఉంది. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠం వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని భక్తుల నమ్మకం. ఈరోజున వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం వద్ద భక్తులు వేకువఝాము నుంచే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంటారు. ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరుతోనూ పిలుస్తారు. అందుకే ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను కలిగి ఉంటుందని చెబుతారు.
హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి చాలా ప్రత్యేకత ఉంది. ఏకాదశి తిథి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనదిగా పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, పారాయణాలు ఉంటాయి. భక్తులు ఉపవాసం, జాగరణ ఆచరిస్తారు. అనంతరం భగవంతుడి సన్నిధిలో జపం, ధ్యానం చేస్తారు. శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం, తిరుపతిలోని తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయానికి వైకుంఠ ఏకాదశి చాలా ముఖ్యమైన రోజు.
వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు మంత్రాలను పఠిస్తూ జపం చేయాలి.
విష్ణు మంత్రం
"ఓం నమో భగవతే వాసుదేవాయ"
కృష్ణ మహా మంత్రం
“హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ, కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ రామ, రామ హరే హరే
జనవరి 2, 2023న వైకుంఠ ఏకాదశి జరుపుకుంటారు. ఏకాదశి తిథి జనవరి 1న రాత్రి 07:11 గంటలకు ప్రారంభమై, జనవరి 2, 2023 రాత్రి 08:23 గంటలకు ముగుస్తుంది. ఆ మరుసటి రోజు సూర్యోదయం తర్వాత ఏకాదశి పరణ జరుగుతుంది. పరణ అంటే ఉపవాసం విరమించడం. కాబట్టి, ఈ రోజు ఉపవాసం ఉండే భక్తులు, జనవరి 3న పారణ సమయాలు ఉదయం 07:14 నుండి 09:19 వరకు ఉంటాయి.
వైకుంఠ ఏకాదశి రోజున మహా విష్ణువుకు పూజ చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రోజున, వైకుంఠ ద్వారం, శ్రీమహావిష్ణువు అంతఃపుర ద్వారం తెరుచుకుంటుంది. ఈ పవిత్రమైన శ్రీ వైకుంఠ ఏకాదశినాడు ఉత్తరద్వారంలో గరుడవాహనంపై వేంచేసియున్న శ్రీమన్నారాయణుని ఎవరైతే సేవిస్తారో వారు పునర్జన్మలేనివారై దుర్లభమైన పరమపదాన్ని పొందుతారని శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్రం బోధిస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్