Sri Rama Navami | రామ మంత్రం అభయం.. శ్రీ రామ నవమి ఎంతో పవిత్రం!-sri rama navami wishes lord ram slokas rama mantras to chant ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Sri Rama Navami Wishes Lord Ram Slokas Rama Mantras To Chant

Sri Rama Navami | రామ మంత్రం అభయం.. శ్రీ రామ నవమి ఎంతో పవిత్రం!

HT Telugu Desk HT Telugu
Apr 10, 2022 06:22 AM IST

శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. రామ నామంతో సకల పాపహరణం. రామ నవమి సందర్భంగా రామ నామ స్మరణ చేసేందుకు శక్తివంతమైన రామనామ శ్లోకాలు చదవండి...

శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. Happy Rama Navami
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. Happy Rama Navami

శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం.. రామరాజ్యం రమణీయం. శ్రీరాముని పట్టాభిషేకం సకల జనులను పరవశింపజేసే ఓ అద్భుతఘట్టం.

ట్రెండింగ్ వార్తలు

ఆ అద్భుతమైన రోజు నేడే. భారతదేశంలో హిందువులంతా చైత్ర శుద్ధ నవమి అనగా ఈరోజు (2022లో ఏప్రిల్ 10) శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటున్నారు.

త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. రాముడి జన్మ దినమును ప్రజలకు ఒక వేడుక. పద్నాలుగు సంవత్సరాల వనవాసము, ఆపై లంకను జయించి.. రావణ సంహారం గావించి తిరిగి అయోధ్య చేరిన తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. అందుకే శ్రీరామ నవమికి అంతటి ప్రాముఖ్యత.

లోకరక్షకుడు.. సుపరిపాలనాదక్షకుడు.. ధర్మనిరతుడు అయిన శ్రీరాముడు అంటే హిందూ మతాన్ని ఆచరించే అందరికీ ఎంతో భక్తి. రామ నామామృతం సకల పాపాలను హరించి వేస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలోని భద్రాద్రిలో కూడా సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. . రామాలయాలన్నీ రామనామ స్మరణలో తరించిపోతాయి.

రామనవమి సందర్భంగా శ్రీరాముని శ్లోకాలు ఇక్కడ కొన్ని అందజేస్తున్నాం.. ఈ శ్లోకాలు ఎంతో శక్తివంతమైనవి.. ప్రభావవంతమైనవి అని ప్రతీతి. మీరూ వాటిని పఠించి ఈ శ్రీరామ నవమిని మరింత వేడుకగా జరుపుకోండి.

1. రామ మూల మంత్రం

ॐ श्री रामाय नमः॥

ఓం శ్రీ రామాయ నమః

2. రామ తారక మంత్రం

श्री राम जय राम जय जय राम॥

శ్రీరామ జయ రామ జయ జయ రామ

3. రామ గాయత్రీ మంత్రం

ॐ दाशरथये विद्महे सीतावल्लभाय धीमहि,

तन्नो राम प्रचोदयात्॥

ఓం దశరథయే విద్మహే సీతావల్లభాయ ధీమహి,

తన్నో రామ ప్రచోదయాత్

4. రామ ధ్యాన మంత్రం

ॐ आपदामपहर्तारम् दाताराम् सर्वसम्पदाम्।

लोकाभिरामम् श्रीरामम् भूयो-भूयो नमाम्यहम्॥

ఓం అపాదమపహర్తారం దాతారం సర్వసంపదమ్ 

లోకాభిరామం శ్రీరామం భూయో-భూయో నమామ్యహమ్

5. కోదండ రామ మంత్రం

श्री राम जय राम कोदण्ड राम॥

శ్రీరామ జయ రామ కోదండ రామ॥

విష్ణు సహస్రకానికి సూక్ష్మరూపంగా చెప్పే శ్లోకం..

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెప్పినట్లుగా నివేదికలు ఉన్నాయి.

హిందుస్థాన్ టైమ్స్ -తెలుగు తరఫున శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

 

WhatsApp channel