Lord Krishna wear peacock feather: కృష్ణుడి తల మీద నెమలి పింఛం పెట్టుకోవడం వెనుక ఎంత కథ ఉందో తెలుసా?
Lord Krishna: దశావతారాల్లో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు. ఆయన్ని తలుచుకోగానే కళ్ళలో నీలం రంగు మోము, తల మీద నెమలి పింఛం, చేతిలో పిల్లన గ్రోవి కనిపిస్తుంది.
Lord Krishna: శ్రీకృష్ణుడు అనగానే గుర్తుకు వచ్చేది నీలం రంగు మొహం. తలపై ధరించిన నెమలి పింఛం, చేతిలో వేణువు. దేశంలో వివిధ రూపాలలో పూజలు అందుకుంటున్న కన్నయ్య రూపం చూసి మురిసిపోని వాళ్ళు ఎవరూ ఉండరు. తల మీద నెమలి పింఛం, వేణువు లేకుండా కృష్ణుడిని ఊహించుకోవడం కష్టం.
నెమలి పవిత్రతకు గుర్తు
కృష్ణుడి తల మీద నెమలి పింఛం ఎందుకు పెట్టుకుంటాడే దాని గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. వెన్నదొంగ, తన అల్లరి చిలిపి చేష్టలతో అందరినీ తనవైపుకి తిప్పుకుంటాడు. కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు.. పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా కృష్ణుడు ఎప్పుడూ హద్దు మీరి ప్రవర్తించలేదు. గోపికలకు కృష్ణుడికి మధ్య ఉన్న పవిత్రమైన చెలిమి మాత్రమే. భోగిగా కనిపించే కృష్ణుడు యోగి.
16 వేల మంది గోపికలు ఉన్నా కూడా కృష్ణుడు అత్యంత పవిత్రుడు. అస్కలిత బ్రహ్మచారి. అంటే స్కలనం ఎరుగని వాడు. అందుకే కృష్ణుడి తల మీద నెమలి పింఛం ఉంటుంది. నెమలి కూడా అత్యంత పవిత్రమైన పక్షి. మగ నెమలితో సంభోగించకుండానే ఆడ నెమలి పిల్లల్ని కంటుంది. కృష్ణుడు తల మీద నెమలి పింఛం ఆయన పవిత్రతను తెలియజేస్తుంది. నెమలి పింఛం పెట్టుకోవడానికి గల కారణం వెనుక ఇంకొక కథ కూడా చెప్తారు.
నాట్యం నేర్పిన కృష్ణయ్య పరవశించిన నెమలి
శ్రీకృష్ణుడి ఒక రోజు వర్షం పడుతూ ఉండగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మురళిని వాయిస్తూ ఉన్నాడు. కృష్ణుడి మురళీ గానానికి అక్కడి ప్రకృతి మొత్తం పులకరించిపోయింది. ఆ సమ్మోహనమైన సంగీతానికి అక్కడ ఉన్న నెమళ్ళు మొత్తం ఆయన చుట్టూ చేరాయి.
కన్నయ్య మురళి వాయిస్తూ నాట్యం చేశాడు. ఆయన అడుగులు గమనించి నెమళ్లు కూడా నాట్యం చేశాయి. దివ్య మురళీ గానం ముగిశాక నెమళ్ళన్నీ కలిసి కృష్ణుడికి నమస్కరించాయి. అద్భుతమైన నాట్యం మాకు నేర్పించిన గురువు మీరు. గురు దక్షిణగా నెమలి పింఛం తీసుకోమని కృష్ణుడు పాదాల వద్ద సమర్పించాయట. దాన్ని తీసుకుని కృష్ణుడు తల మీద ధరించాడు.
నెమలి పింఛం కన్నయ్య అందాన్ని మరింత పెంచింది. నెమలి పింఛం దిష్టి తగలకుండా కాపాడుతుంది. నెమలిని పవిత్రమైన పక్షిగా హిందువులు భావిస్తారు. అది మన ఇంట్లో ఉంటే సకల సంపదలు కలుగుతాయని నమ్ముతారు. నెమళ్లు వర్షం పడినప్పుడు చల్లని వాతావరణానికి పులకించిపోయి పురివిప్పి నాట్యం ఆడతాయి.
సర్ప దోషం నుంచి రక్షణ
శ్రీకృష్ణుడికి కాలసర్ప యోగం ఉంది. నెమలి, పాము మధ్య శత్రుత్వం ఉంది. కాల సర్పయోగం ఉన్న వాళ్ళు నెమలి పింఛం దగ్గర ఉంచుకుంటే మంచిదని కొందరు సూచిస్తారు. దోష ప్రభావం తగ్గించడం కోసం ఈ నెమలి పింఛం ఆయన దగ్గర ఉంటుందని మరికొందరు నమ్ముతారు. అంతే కాదు శ్రీకృష్ణుడు ఓడించిన కాళీయుడనే మహా సర్పం ఆయన దగ్గరకు చేరకుండా నెమలి పింఛం హెచ్చరిస్తుంది. ఎందుకంటే సర్పాలకు నెమలి శత్రువు. అవి అంటే భయపడతాయి.
టాపిక్