తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Karthika Masam 2024: కార్తీకమాసంలో పాటించాల్సిన నియమాలు ఏంటి? ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకోండి

Karthika masam 2024: కార్తీకమాసంలో పాటించాల్సిన నియమాలు ఏంటి? ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకోండి

Gunti Soundarya HT Telugu

17 October 2024, 15:20 IST

google News
    • Karthika masam 2024: ఈ ఏడాది నవంబర్ 2 నుంచి కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. విష్ణుమూర్తికి, పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ మాసం. అందుకే ఈ మాసంలో ఉపవాసం ఉండి భక్తి శ్రద్దలతో పూజలు చేయడం వల్ల మోక్షం లభిస్తుందని, సర్వ పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. 
కార్తీకమాసం నియమాలు
కార్తీకమాసం నియమాలు (pixabay)

కార్తీకమాసం నియమాలు

హిందూ మతంలో కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసానికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో శివుడు, విష్ణుమూర్తిని పూజిస్తారు.

ఏకాదశి, కార్తీక మాసాల్లో చేసే ఉపవాసాలు శ్రీమహావిష్ణువు ఎంతో ప్రీతికరమని చెబుతారు. ఈ మాసంలో భగవంతుడిని పూజించడం వల్ల దేవుడు సంతోషిస్తాడు. కార్తీకమాసంలో స్నానానికి, దానానికి, దీపదానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్తీకమాసంలో దేవుత్తని ఏకాదశి రోజున శ్రీమహా విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కోంటాడు. ఈ రోజున శ్రీమహా విష్ణువును నిత్యం పంచామృతంతో అభిషేకించి మంత్రాలను పఠించాలి. ఏడాది పొడవునా ఇలా చేయలేకపోతే కనీసం కార్తీక మాసంలో అయినా చేయండి.

కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయడం చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా గంగా, యమునా లేదా మరేదైనా పవిత్ర నదిలో స్నానం చేయడానికి ప్రాధాన్యత చాలా ఎక్కువ. మీరు స్నానం చేయడానికి నదికి వెళ్లలేకపోతే మీరు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం వేసి స్నానం ఆచరించవచ్చు.

కార్తీక మాసం నియమాలు

కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. కార్తీకమాసంలో దీపదానం, తులసి పూజ, నేలపై పడుకోవడం, పప్పులు త్యజించడం, ఆత్మనిగ్రహం, ఆహారంలో మితంగా ఉండాలి. ఈ రోజున శంఖం ఊది దేవుడికి శంఖం నీటితో అభిషేకం చేయాలి. కార్తీకమాసంలో తులసిని సేవించి దాని ముందు దీపం వెలిగించడం ద్వారా విష్ణువు ప్రసన్నుడవుతాడు. సంపద, శ్రేయస్సు పొందడానికి శాలిగ్రామ రూపంలో విష్ణువును పూజిస్తారు.

ఇక కార్తీకమాసంలో వచ్చే సోమవారాలు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఆరోజు అందరూ శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి కార్తీక పురాణం చదువుకుంటారు. ఈ మాసంలో చేసే మతపరమైన కార్యక్రమాల పుణ్యం అనేక రెట్లు పెరుగుతుంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు గంగాస్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శాస్త్రాల ప్రకారం ఈ మాసంలో స్నానం చేయడం వల్ల ఒక వ్యక్తి పాపాలు నశిస్తాయి. మరణం అనంతరం అతనికి మోక్షం లభిస్తుంది.

కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం చాలా మంచిది. నెయ్యి లేదా నూనె దీపాలు వెలిగిస్తారు. చీకటిపై కాంతి విజయాన్ని ఇది సూచిస్తుంది. ప్రతికూలతలు తొలగిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయంలో దీపం వెలిగించడం మంచిది. అలాగే తులసి వివాహం కార్తీకమాసంలోనే జరిగిందని చెబుతారు. అందుకే ఈ మాసంలో తులసి మొక్కను నిత్యం పూజించి దీపం పెడతారు.

ఈ నెల రోజులు సోమవారం నాడు ఉపవాసం ఆచరిస్తారు. మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఈ మాసంలో ధార్మిక చర్యలు, దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. దైవిక ఆశీర్వాదాలు కోరుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలి.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

తదుపరి వ్యాసం