Tulasi mala: తులసి మాల ధరించడానికి పాటించాల్సిన నియమాలు ఏంటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
08 July 2024, 14:17 IST
- Tulasi mala: కొంతమంది తులసి మాలను ధరిస్తారు. ఇది ఎక్కువగా ఎవరు ధరిస్తారు? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎందుకు ధరిస్తారు? అనే విషయాలు తెలుసుకుందాం.
తులసి మాల ఎందుకు ధరిస్తారు?
హిందూ సంస్కృతిలో తులసి మాలకు లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంది. భక్తి, స్వచ్చత, దైవిక రక్షణకు ప్రతీక. తులసి మాల ధరించడం, రోజువారీ జీవితంలో దాని ఆచారాలను చేర్చడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక వృద్ధిని పొందుతారు. చాలా మంది ధ్యానం చేసేటప్పుడు, మంత్రాలు జపించేటప్పుడు జప మాల, తులసి మాల, రుద్రాక్ష మాల ఉపయోగిస్తూ ఉంటారు.
తులసి మాల ధరించడం వల్ల ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ప్రయాణం సుసంపన్నం అవుతుంది. దైవంతో ఉండే బంధం మరింత బలపడుతుంది. భక్తి, స్వచ్చతకు చిహ్నమైన తులసి మాల ధరించడం వల్ల ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయనిచెబుతారు. విశ్వాసం, ఆధ్యాత్మిక సామరస్యాన్ని పెంపొందిస్తుంది.
తులసి మాల అంటే ఏంటి?
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత ప్రాధాన్యత ఉంది. అటువంటి తులసి మొక్క ఆకుల నుంచి తయారు చేసినదే ఈ జపమాల. విష్ణుమూర్తి సతీమణి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది ఇది. ఈ మొక్క సుగంధ ఆకులు, ఔషధ గుణాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. తులసి మాల ధరించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.
తులసి స్వచ్చత, భక్తి, శుభప్రదానికి చిహ్నంగా భావిస్తారు. దీనిని తరచుగా ఇంట్లో, దేవాలయాలలో పూజిస్తారు. తులసిని పూజించడం వల్ల మరణం తర్వాత మోక్షం లభిస్తుందని మరుజన్మ ఉండదని నమ్ముతారు. పవిత్రమైన ఈ మొక్కకు దేవతలతో కూడా అనుబంధం ఉంది.
తులసి మాల ఎందుకు ధరిస్తారు?
తులసి లేనిదే విష్ణుమూర్తి భోగం అసంపూర్ణంగా భావిస్తారు. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది తులసి. ఈ మాల ధరించడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి, భక్తి, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ మాలను భక్తులు తమ మెడలో లేదా మణికట్టుకు రక్షణ సూత్రంగా కూడా ధరిస్తారు. ఇది మనస్సు, శరీరం, ఆత్మను శుద్ది చేస్తుందని నమ్ముతారు. తులసి మాలను ఎక్కువగా శ్రీకృష్ణుడి భక్తులు, వైష్ణవులు ధరిస్తారు. ఈ మాల ధరించిన వాళ్ళు దేవుడికి అత్యంత ఇష్టమైన వారిగా ఉంటారని విశ్వసిస్తారు.
తులసి మాలతో మంత్రాలు జపిస్తారు. ఈ మాల ధరించినప్పుడు భక్తులు విష్ణు సహస్రనామం ధరించడం లేదా హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ హరే హరే అనే మహా మంత్రాన్ని పఠించవచ్చు. ఇది మాత్రమే కాకుండా విష్ణుమూర్తికి అంకితం చేసిన ఏ మంత్రాలు అయినా జపించవచ్చు. ఈ మాల ధరించడం వల్ల పీడకలలు, దుష్టశక్తుల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. తులసి మాలను ధరించాలని అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా మద్యం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి.
ఆరోగ్య ప్రయోజనాలు
తులసి మాల కేవలం భక్తి భావాన్ని ఇవ్వడం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుంది. తులసి ఆకులు ఆయుర్వేదంలో ఔషధ గుణాలకు ప్రసిద్ధి. ఈ మాల ధరించడం వల్ల శ్వాసకోశ రుగ్మతలు, జీర్ణ సమస్యలు నయం అవుతాయి. సహజ రోగనిరోధక శక్తిని ఇస్తుంది. తులసి ఆకులను కాల్చడం లేదా తులసి నీటిని ఉపయోగించడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి రక్షణ ఏర్పడుతుంది. పర్యావరణం శుద్ది అవుతుంది. పరిసరాలను శుద్ది చేస్తుందని నమ్ముతారు.
టాపిక్