Powerful mantras: సంపద, శ్రేయస్సును ఇచ్చే శక్తివంతమైన మంత్రాలు.. నిత్యం పఠిస్తే కష్టాలే ఉండవు-chanting these powerful mantras daily for being prosperity and abundance ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Powerful Mantras: సంపద, శ్రేయస్సును ఇచ్చే శక్తివంతమైన మంత్రాలు.. నిత్యం పఠిస్తే కష్టాలే ఉండవు

Powerful mantras: సంపద, శ్రేయస్సును ఇచ్చే శక్తివంతమైన మంత్రాలు.. నిత్యం పఠిస్తే కష్టాలే ఉండవు

Gunti Soundarya HT Telugu
Jun 19, 2024 10:05 AM IST

Powerful mantras: సంపద, శ్రేయస్సును అందించే కొన్ని శక్తివంతమైన మంత్రాలు ఇవి. వీటిని నిత్యం పఠించడం వల్ల జీవితంలోని కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు. ఆనందంగా జీవించగలుగుతారు.

సంపద, శ్రేయస్సును ఇచ్చే శక్తివంతమైన మంత్రాలు
సంపద, శ్రేయస్సును ఇచ్చే శక్తివంతమైన మంత్రాలు (pixabay)

Powerful mantras: ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం ఉంటుంది. ధనవంతులుగా, సంపన్నులుగా ఉండాలనే కోరిక భౌతిక సౌకర్యాలు గడపాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం అవకాశాలు వెతుక్కుంటారు. అయితే కొన్నిసార్లు ఎటువంటి ప్రయత్నాలు చేసినా అవి విఫలమవుతూ ఉంటాయి.

మీరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నట్లయితే శ్రేయస్సు, సమృద్ధికి సంబంధించి సహాయపడే ఈ మంత్రాలను పఠించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. స్వచ్ఛమైన మనసుతో క్రమం తప్పకుండా ఈ మంత్రాలు జపించడం వల్ల శ్రేయస్సు, సమృద్ధి, సంపదను పొందుతారు. 

గాయత్రీ మంత్రం

గాయత్రీ దేవికి అంకితం చేసిన మంత్రం ఇది. అత్యంత శక్తివంతమైన వేద శ్లోకాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ మంత్రం రుగ్వేదంలో కనుగొన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానోదయం, జ్ఞానం,  దైవిక మార్గదర్శకత్వం కోసం నిత్యం గాయత్రీ  మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని జపించడానికి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవాలి. శ్వాసపై దృష్టి కేంద్రీకరించాలి. మంత్రంలోని పదాలను స్పష్టంగా ఉచ్చరించాలి. ఓం శబ్దంతో ప్రారంభమయ్యే ఈ మంత్రం ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. 

ఓం గం గణపతియే నమః

అడ్డంకులను తొలగించేవాడు, అదృష్టాన్ని తెచ్చేవాడిగా గణేషుడిని పూజిస్తారు. ఈ గణేష్ మంత్రం విజయం, శ్రేయస్సు రెండింటిని ఇస్తుంది. ఏదైనా కొత్త వ్యాపారం లేదా కార్యకలాపాలు సాఫీగా అడ్డంకులు లేకుండా జరగాలని కోరుకుంటూ వినాయకుడిని పూజిస్తారు. ఈ మంత్రం వినాయకుడి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. విజయం, శ్రేయస్సు కోసం వినాయకుడి ఆశీర్వాదాలు కోరుకుంటూ ఈ మంత్రాన్ని చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో జపించాలి. ఇలా చేస్తే అడ్డంకులు తొలగి సమృద్ధి లభిస్తుంది. 

దుర్గా మంత్రం

యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సమస్తిత నమస్తస్యే నమస్తస్యే నమస్తస్యే నమో నమః ।

దుర్గాదేవికి అంకితం చేసిన ఈ మంత్రం దైవిక స్త్రీ శక్తికి అంకితం. బలాన్ని, రక్షణ, శ్రేయస్సుని ఇవ్వమని కోరుకుంటూ అమ్మవారికి ఈ మంత్రం ద్వారా విజ్ఞప్తి చేసుకోవచ్చు. ఈ ఒక్క మంత్రాన్ని పఠిస్తే దుర్గాదేవి అన్ని రూపాలను పూజించినట్లే.  భక్తితో స్వచ్ఛమైన హృదయంతో జపించడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు లభిస్తాయి.  ధైర్యం సమృద్ధి శ్రేయస్సు పొందుతారు. 

ఓం వసుధరే స్వాహా

బౌద్ధ దేవత వసుధారకు అంకితం చేసిన మంత్రం ఇది. బౌద్ధ సంప్రదాయంలో వసుధార దేవత సంపద, సంతానోత్పత్తికి ప్రతీకగా భావిస్తారు. అమ్మవారి దీవెనలు కోరుకుంటూ భౌతిక, ఆధ్యాత్మిక, సంపద కోసం స్పష్టమైన ఉద్దేశంతో కృతజ్ఞతా భావంతో ఈ మంత్రాన్ని జపించడం మంచిది. ఇలా చేయడం వల్ల శ్రేయస్సు లభిస్తుంది. 

లక్ష్మీ మంత్రం

ఓం హ్రీం శ్రీం లక్ష్మీం భ్యో నమః

లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సుకు అధి దేవత. అమ్మవారి అనుగ్రహం లేనిదే ఎటువంటి పనిలోనూ శ్రేయస్సు లభించదు. అందుకే లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడం కోసం ఈ మంత్రం నిత్యం పఠించడం మంచిది. ఈ మంత్రం బీజమంత్రమైన హ్రీం, శ్రీమ్ లను మిళితం చేస్తుంది. ఏకాగ్రతతో మంచి హృదయంతో మంత్రం జపించడం వల్ల శ్రేయస్సు సమృద్ధి లభిస్తాయి.

కుబేర మంత్రం

ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః

కుబేరుడికి అంకితం చేసిన మంత్రం ఇది. హిందూమతంలో సంపద అధిదేవుడిగా భావిస్తారు. ఈ మంత్రాన్ని చిత్తశుద్ధితో ఏకాగ్రతతో జపించడం వల్ల ఆర్థిక సమృద్ధి లభిస్తుంది. ఆశీర్వాదాలు పొందుతారు. 

ఓం నమః శ్శివాయ

శివునికి అంకితం చేసిన ఈ మంత్రం సానుకూల శక్తిని, సమృద్ధిని ఆకర్షిస్తుంది. ఈ మంత్రాన్ని ప్రశాంతమైన వాతావరణంలో పఠించడం వల్ల మనసు, ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. క్రమం తప్పకుండా జపించడం వల్ల మీ పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. సానుకూల జీవితానికి దోహదపడుతుంది. శ్రేయస్సును ఆహ్వానించేందుకు సహాయపడుతుంది.

ఓం

ఓం మంత్రాన్ని జపించడం అనేది వేల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సాధనగా ఉంది. ఓంకారాన్ని పఠిస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మాత్రంగా దీన్ని పరిగణిస్తారు. శారీరక, మానసిక శ్రేయస్సును మెరుగుపరిచే ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ మంత్రం జపించడం వల్ల మన చుట్టూ సానుకూల శక్తి ప్రసరిస్తుంది.