ఈ వారం వారఫలాలు- ఈ రాశి వాళ్ళు బ్యాంక్ వివరాలు గోప్యంగా ఉంచుకొకపోతే చిక్కులే
06 October 2024, 2:00 IST
Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. అక్టోబర్ 6 వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
అక్టోబర్ 6 వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు వారఫలాలు
రాశి ఫలాలు (వార ఫలాలు) 06.10.2024 నుంచి 12.10.2024 వరకు
మాసం : ఆశ్వయుజం, సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. శనివారం నాడు ముఖ్యుల కల యిక వీలుపడదు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆరోగ్యం జాగ్రత్త. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. సామరస్యంగా మెలగండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.
వృషభం
ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే తప్పు దారి పట్టిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. ఆత్మీయులకు మీ సమస్యలు తెలియజేయండి. ఒక సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి.
మిథునం
మీ ఓర్పునేర్చులకు పరీక్షా సమయం. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. బుధవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పనులు వేగవంత మవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు.
కర్కాటకం
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆది, సోమవారాల్లో నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. పిలల్లకు శుభం జరుగుతుంది. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి.
సింహం
సర్వత్రా అనుకూలదాయకం. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. మొండి బాకీలు వసూలవుతాయి. అయిన వారి కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. సకాలంలో పనులు పూర్తి కాగలవు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. గురువారం నాడు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. సోదరులను సంప్రదిస్తారు. కీలక పత్రాలు అందుతాయి.
కన్య
పరిస్థితులు నిదానంగా చక్క బడతాయి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచు కోండి. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. ఆదాయం బాగుంటుంది. శుక్ర, శనివారాల్లో పనులు ఒక పట్టాన సాగవు. కొందరి వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. పిల్లల అత్యుత్సాహం కట్టడి చేయండి.
తుల
శ్రమాధిక్యత మినహా ఫలితం శూన్యం. ఆర్థికస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలోచలతో సతమతమవుతారు. అనునయంగా మెలగండి. పట్టుదలకు పోవద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.
వృశ్చికం
సమర్థతను చాటుకుంటారు. అందరిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. వాయిదాపడిన పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. మంగళవారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త.
ధనుస్సు
ఈ వారం ఆశాజనకం. లక్ష్యం నెరవేరుతుంది. ఎంతటివారినైనా ఆకట్టుకుం టారు. మీ కష్టం ఫలిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. విలువైన వస్తువులు జాగ్రత్త. అవివాహితులకు శుభయోగం. ఉల్లాసంగా గడుపుతారు. కీలకపత్రాలు అందుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది.
మకరం
ఆటుపోట్లకు దీటుగా స్పంది స్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. మనో ధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. పిల్లల కదలికలపై దృష్టి సారిం చండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు.
కుంభం
ఈ వారం వారఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఆర్ధికలావాదేవీలతో తీరిక ఉండదు. పనులు, కార్యక్రమాలు సాగవు. చిన్న విషయానికే ఉద్రేకపడతారు. మీ కోప తాపాలు అదుపులో ఉంచుకోండి. పరిచయ స్తులే వ్యతిరేకులవుతారు. బుధవారం నాడు పనులు సాగవు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. పిల్లల యత్నాలు ఫలిస్తాయి. ఆందోళన తగ్గి స్థిమిత పడతారు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కలిసివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు.
మీనం
లక్ష్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. గత అనుభవాలు మరిచిపోవద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు.