సెప్టెంబర్ 28, నేటి రాశి ఫలాలు- అప్పుల నుంచి ఉపశమనం, శుభవార్తలు వింటారు-today saturday september 28th rasi phalalu in telugu check zodiac wise resutls for daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సెప్టెంబర్ 28, నేటి రాశి ఫలాలు- అప్పుల నుంచి ఉపశమనం, శుభవార్తలు వింటారు

సెప్టెంబర్ 28, నేటి రాశి ఫలాలు- అప్పుల నుంచి ఉపశమనం, శుభవార్తలు వింటారు

HT Telugu Desk HT Telugu
Sep 28, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ02.09.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

సెప్టెంబర్ 28 నేటి రాశి ఫలాలు
సెప్టెంబర్ 28 నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 28.09.2024

వారం: శనివారం , తిథి: కృ.ఏకాదశి,

నక్షత్రం: ఆశ్లేష ‌, మాసం: భాద్ర‌ప్ర‌ద‌,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

రవి సంచారం మాస ద్వితీయార్ధంలో అత్యంత అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. గృహమున ఆనందోత్సవాలు ఉంటాయి. తలపెట్టిన పనులు సత్వరమే పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తివృద్ధి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో వృద్ధి ఆశించిన ఫలితాలుంటాయి. ఆత్మీయుల‌తో ఆనందంగా గడుపుతారు. మాన‌సిక ప్ర‌శాంత‌త లభిస్తుంది.

వృషభం

ఆరోగ్య సమస్యలకు వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. స‌మాజంలో పలుకుబడి, గౌరవం పెరుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. కొత్త విషయాలపై అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు కొత్త కోర్సులలో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆత్మీయుల‌ను క‌లుస్తారు. క‌ష్ట‌సుఖాలు పంచుకుంటారు.

మిథునం

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు ఈరోజు మానసిక ఒత్తిళ్లు, ఆందోళన‌లను అధిగమిస్తారు. బంధువులు మరియు స్నేహితులు మీ విలువను గుర్తించి మీకు గౌరవం ఇస్తారు. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. చిన్న‌నాటి స్నేహితుల‌ను క‌లుస్తారు. మ‌ధుర జ్ఞాప‌కాలు నెమ‌రు వేసుకుంటారు. దైవ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

కర్కాటకం

మీ ఆదాయానికి మించి ప్రోత్సాహం కలుగుతుంది. మీ తోబుట్టువుల నుండి కూడా కొన్ని లాభాలు కలుగుతాయి. పిల్లల విషయంలో వృద్ధి. సంతోషకరమైన శుభవార్తను వింటారు. సమాజంలో మీ హోదా, గౌరవం పెరుగుతాయి. ప్ర‌శాంత‌మైన స‌మ‌యాన్ని గ‌డుపుతారు.

సింహం

శుభవార్తలు వింటారు. ఆరోగ్యము, ఆదాయ అవకాశాలు లభిస్తాయి. స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ఇది సరైన సమయం. వివాహ అవకాశాలు, వినోదం మరియు వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. ఇష్ట‌మైన వారితో విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతారు. మంచి జ‌రుగుతుంది.

కన్య

సంపద, ఆనందం, విద్యలో విజయం, వివాహ అవకాశాలు, వినోదం మరియు వ్యాపారంలో వృద్ధిని పెంచుతుంది. ఇతరులను శాసించాలనే దృక్పథం వీడితే సీనియర్లతో మరిన్ని సమస్యలను తగ్గించుకోవచ్చు. శివారాధ‌న స‌త్ఫ‌లితాలు ఇస్తుంది.

తుల

మీ ప్రాముఖ్యత అవసరాన్ని అందరూ గుర్తిస్తారు. రాజకీయంగా ఎదుగుదలకు మంచి సమయం. స్థానిక సమస్యలకు న్యాయస్థానమును ఆశ్రయిస్తారు. వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అమ్మ‌వారి దేవాల‌యాన్ని సంద‌ర్శించండి. మంచి జ‌రుగుతుంది.

వృశ్చికం

ఆశయ సిద్ధి ఉంది. అప్పుల నుండి ఉపశమనము పొందుతారు. ఆర్థిక స్థిరత్వము ఉంది. అందరికీ ప్రయోజనకారిగా ఆదర్శంగా ఉంటారు. వస్తువస్త్ర ఆభరణములను కొనుగోలు చేస్తారు. వాహనచోదకులు అప్రమత్తంగా ఉండాలి. హ‌నుమాన్ దేవాల‌యాన్ని సంద‌ర్శించండి. మంచి జ‌రుగుతుంది.

ధనుస్సు

మీరు పదిమందికి అండదండగా ఉంటూ కార్యజయం పొందుతారు. భార్య, తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుజ సంచారం దోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధన, అభిషేకం, ప్రదక్షిణలు చేయాలి. అలా చేయ‌డం వ‌ల్ల మీకు మంచి ఫ‌లితాలు అందుతాయి.

మకరం

నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారి ఉన్నతమైన ఆశయములే మిమ్ములను ముందుకు నడిపిస్తాయి. ఒక ఆహ్లాదకరమైన జీవన శైలికి ఆలవాటు పడతారు. బంధుమిత్రుల ప్రశంసలు, పరిచయం అట్లే మంచి మిత్రుల అండ మీకుంటుంది. దైవ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. మీకు మంచి ఫ‌లితాలు అందుతాయి.

కుంభం

చెడు సహవాసాలకు దూరంగా ఉండటం మంచిది. సహోద్యోగులతో వివాదాల నుండి తెలివిగా తప్పించుకుంటారు. విద్యార్థులు ప్రయత్నాలు తీవ్రతరం చేస్తారు. కృషి మరియు శ్రద్ధ అవసరాన్ని గుర్తిస్తారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

మీనం

అంత అనుకూలముగా లేదు. వాదనకు దూరముగా ఉండండి.వ్యాజ్యాల విషయాల్లో ఉపశమనం కనిపిస్తుంది. సంపాదన మెరుగుపడుతుంది. వాహనం, సంపద మరియు విలాసవంతమైన సౌకర్యాలతో జీవనశైలి సంపన్నంగా ఉంటుంది. వేంక‌టేశ్వ‌ర స్వామి వ్ర‌తాన్ని ఆచ‌రించండి. మంచి జ‌రుగుతుంది.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ